పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది పింక్ మూవీకి రీమేక్. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నారు. ఇది అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి రీమేక్. ఇలా వరసగా రెండు రీమేక్స్ చేసిన పవర్ స్టార్ ఇప్పుడు ముచ్చటగా మూడో రీమేక్ కి ఓకే చెప్పడం విశేషం. ఇంతకీ ఏ రీమేక్ అంటారా..? వినోదయా సితం అనే తమిళ చిత్రం రీమేక్ లో నటించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారని తెలిసింది.
నటుడు, దర్శకుడు సముద్రఖని తీశాడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనే తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఒక పాత్ర పోషించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారట. అయితే… ఇందులో పవన్ కల్యాణ్ హీరో కాదు. ఆయనది చిన్న పాత్ర. ప్రధాన పాత్రలో సాయి తేజ్ నటిస్తాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇది చిన్న చిత్రం. పవన్ కళ్యాణ్ కి పెద్దగా పని ఏమి ఉండదు. పది రోజుల్లో పూర్తి చేస్తారట.
అయితే.. కథలో ఉన్న బలం కారణంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారట. ఇది కూడా స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అయితే వరుసగా మూడు రీమేక్ సినిమాలను వదిలినట్లు అవుతుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించనున్నట్టు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి.. పవర్ స్టార్ ఇంకెన్ని రీమేక్ లకు ఓకే చెబుతాడో చూడాలి.











