నీహారిక వివాహానంతరం హైదరాబాద్ చేరుకున్న మెగా కుటుంబం వారి రిసెప్షన్ కూడా నిర్వహించింది నూతన దంపతులు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చారు కూడా. అనంతరం శుక్రవారం నీహారిక తన జన్మదినోత్సవాన్ని నిరాడంబరాగానే జరుపుకున్నట్లు సమాచారం. కుమార్తె బర్త్ డేని పురస్కరించుకుని నాగబాబు సోషల్ మీడియాలో ఆమె చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ఆశీస్సులు అందజేశారు. అలాగే భర్త చైతన్యతో పాటు కుటుంబ సభ్యులంతా నిహారికకు శుభాకాంక్షలు అందజేశారు. ఇదిలావుండగా, వీలైనంత త్వరలో నీహారిక దంపతులు మాల్దీవులకు లేదా గ్రీస్ కు హానీమూన్ ట్రిప్ వెళతారని పరిశ్రమలో వినిపిస్తోంది.
Also Read: మెగా డాటర్ కానీ ఫోటోలో ఉండి ఉంటేనా?












