ఒకవైపు ఆదిలాబాద్ కాల్పుల సంఘటన సంచలనం సృష్టిస్తున్న సమయంలోనే.. అమెరికాలో ఒక హైదరాబాదీపై జరిగిన కాల్పుల విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సంఘటన జరిగిన తర్వాత.. రెండు వారాలకు ఈ ఘటన వెలుగులోకి రావడం విశేషం. ఈ ఘటనలో పాతబస్తీ చంచల్గూడ ప్రాంతానికి చెందిన సిరాజ్ సురక్షితంగానే ఉన్నాడు. అమెరికాలోని చికాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సిరాజ్ అమెరికాలో పనిచేస్తున్నాడు. డిసెంబర్ 4వతేదీన తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో ఆఫీసులో విధులు ముగించుకుని తిరిగి వస్తుడగా, డెవాన్ నార్త్ ప్రాంతంలో కారుపై గుర్తు తెలియని వ్యక్తులు నాలుగురౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిరాజ్ సురక్షితంగా బయటపడ్డాడు. కారు వెనుక సీటు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి, యుఎస్ఎలోని భారత రాయబారి మరియు చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు.
Also Read: అమెరికా.. గెట్ రడీ.. ఫైజర్ వచ్చేస్తోంది..











