డ్రగ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయా?
డ్రగ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిజమేకాబోలు అన్న సందేహాలు లేకపోలేదు. ఏపి రాజధాని అమరావతిలోని గుంటూరు – విజయవాడ బోర్డల్లో ఉన్న ఓ కాలేజీలో తొలుత పురుడుపోసుకున్న ఈ దందా. అది కాస్తా .. ప్రైవేటు ఆధీనంలో ఉన్న పోర్టుల ద్వారా ట్రాన్స్ పోర్టు అవుతూ ఏపీకి వచ్చి చేరుతుంది. నిఘా వైఫల్యం అత్యంత దయనీయంగా పడిపోయిన ఏపీనే టార్గెట్ చేసుకుని దందాకు డ్రగ్ మాఫియా విజయవాడ లో బీజం వేసింది. వందల కేజీల్లో దిగుమతైన హిరాయిన్ అక్కడ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎక్స్ పోర్ట్ చేస్తున్నారన్నది పరిశోధనలో తెలిపిన సారంశం. ఏపిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ సుప్తచేతనావస్థల్లో ఉన్ననేపథ్యాన్ని ఆసారాగా తీసుకుని డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ మాఫియాలో కృష్ణాజిల్లాకు చెందిన ఓ ముఖ్య నాయకుడి పాత్ర ఉందని, సెటిల్మెంట్స్, మాఫియా టీంల ఏర్పాట్లో దిట్టగా పేరుగాంచిన ఆ నాయకుడు ఈ డ్రగ్స్ దందాకు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కథ నడిపిస్తున్నాడని భోగట్ట. అయితే ఏపీ టూ ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న డ్రగ్స్ గరళాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఎప్పుడో చెప్పింది .. ‘ఈ పాపపు దందా మూలాలన్నీంటికీ ఏపీనే కేంద్రమని.’
విశృంఖలంగా గంజాయి సాగు .. అమ్మకాలు!
ఉత్తరాంధ్రా నుంచి అంతరాష్ట్రాలకు ఎగుమతువున్న గంజాయి విలువ దర్యాప్తులో తెలిన లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లకు పైమాటే. గడిచిన రెండేళ్ళల్లో ఏటా 15 వేల ఏకరాల్లో గంజాయిని సాగు చేస్తుండగా .. విడి గంజాయి,లిక్విడ్ గంజాయితో కలిసి ఏటా రూ.50 వేల కోట్ల మేరకు వ్యాపారం సాగుతోంది అన్నది విపక్షాల ఆరోపణలు. మొన్నటి మొన్న లక్నో – ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేలో ఆంధ్ర నుంచి ఢిల్లీ వెళ్తున్న గంజాయిని డీఆర్ఐ పట్టుకుంది. ఏపీ నుంచి యూపీకి తరలివెళ్తున్న టన్నుల కొద్దీ గంజాయి లక్నో కేంద్రంగా వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది అన్నది డీఆర్ఐ దర్యాప్తు సారాంశం. కట్ చేస్తే .. ఆ మధ్య గంజాయి మత్తును లిక్విడ్ రూపంలో మార్చి అమ్మకాలు జరిపేలా పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారని బోర్డర్ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం పెట్టిమరి సిగ్గు తీస్తున్నారు. ఆ మొన్న విశాఖలో పర్యటనలో భాగంగా జనసేనా పవన్ కూడా ఏపీ పోలీసుల పనితీరు, గంజాయి సాగుపై కామెంట్స్ చేశారు. గంజాయి మూలాలను వెతికి కూకటివేళ్లతో సహా పెకలిచాలంటే పోలీసులను వారి డ్యైటీ వారిని చేయనియ్యండి .. పూర్తి దర్యాప్తు స్వేచ్ఛనీయండి అని హితవు పలికారు. ఇందులో దాగిన కోణాలను ప్రత్యేకించి ఆవిష్కరించాల్సిన పనిలేదు. దందాలో అధికారపార్టీ ప్రముఖుల భాగోతం ఏ స్థాయిదో ఇట్టే అర్థమౌతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనారోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, గంజాయి దందా రాజ్యమేలతోంది అన్నది వాస్తవం. నార్కోటిక్ హబ్ ఆఫ్ ది నేషన్ పూణే, ముంబాయి, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు గంజాయి సరాఫరా చేసేది ఏపీనే అని దర్యాప్తు సంస్థలు హెచ్చరిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం.
అంతరాష్ట్ర మద్యం రవాణతో ఆదాయం ఆవిరి ..
గంజాయి, డ్రగ్స్ దందాతోపాటు అంతరాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమమద్యం ఏరులై పారుతోంది. ఉత్తరాంధ్రంలో గంజాయి, విజయవాడ, కాకినాడ కేంద్రంగా డ్రగ్స్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలో అంతరాష్ట్రాల మద్యం సాగిస్తున్న దందా లెక్కకు మించి అన్నట్లు ఉంది. మద్యాపాన నిషేదం అని అన్న జగన్ రెడ్డి మద్యం ధరలు పెంచి, వాటి బాధ్యతలు ఉత్తరాంధ్రా నాయకుడికి, ఇసుక దందా రాయసీమ నాయకుడి చేతులో పెట్టి హోల్ సెల్ గా రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారు. తాగేందుకు మద్యం బ్రాండ్లు లేవు, ధరలు అమాంతం పెంచేసి లూటీ చేస్తున్నాడని సగటు మందుబాబుల అవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అనేక సవాళ్లు ను ఎదుర్కొంటుంది. కృష్ణాపరివాహక ప్రాంతం నుంచి తెలంగాణ మద్యం కేసుల కొలది వచ్చి నగరాలకు, పట్టణాలకు, గ్రామాలకు సైతం చేరుతోంది. ప్రభుత్వం తరుఫున మద్యం అమ్మకాలు, అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పహారా, కృష్ణాపరివాక ప్రాంతాను పడవల ద్వారా 24 – అవర్స్ ఏపీ తీరానికి వచ్చే తెలంగాణ మద్యం విలువ కొన్ని వందల కోట్లు ఉంటుందని ఎక్సైజ్ దర్యాప్తులో వెల్లడౌతున్న నిజాయి. గతంలో గ్రామాల్లో ఊరికొకటో రెండో ఉంటే బెల్ట్ షాపులు నేడు జగన్ రెడ్డి పుణ్యామాని పదుల సంఖ్యలో వెలిశాయి. ప్రభుత్వ వైన్స్ లో బ్రాండ్లు దొరకవు .. అధిక ధరలు వెచ్చించి కొనాల్సి వస్తుంది అని మందుబాబులు ఫిక్స్ అవ్వడంతో తెలంగాణ మద్యానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీంతో ఏపి ప్రభుత్వం గడిచిన ఏడాదికాలంలో మద్యంపై రూ. 10 వేల కోట్లుకు పైగా ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా అప్పనంగా పక్క రాష్ట్రాలకు జగన్ రెడ్డి ముట్టజెప్పాడని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి.











