పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న భారీ పిరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు అనూహ్యమైన స్పందన రావడంతో రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి ఇది జాతకానికి, సైన్స్ కి లింకు చేస్తూ రూపొందించిన సినిమా అని అర్ధం అవుతుంది. దీంతో కామన్ ఆడియన్స్ లో సైతం క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే.. ప్రేక్షకాభిమానుల్లో ఏర్పడిన అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. ఆయన ఈ సినిమా క్లైమాక్స్ గురించి చెప్పిన విశేషాలు ఆసక్తిగా మారాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే… ఈ క్రేజీ మూవీ క్లైమాక్స్ కోసమే దాదాపు సంవత్సరం పాటు వర్క్ చేసినట్టు చెప్పారు. 1970ల కాలం నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమాలో విక్రమాదిత్య అనే పామిస్ట్ అంటే.. హస్తసాముద్రికా నిపుణుడుగా ప్రభాస్ నటిస్తున్నారు. ఇక ప్రేరణ పాత్రలో పూజా నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని.. దీని కోసం దాదాపు ఒక ఏడాది పాటు ఆలోచించామన్నారు.
ఇంకా చెప్పాలంటే.. ఇలాంటి క్లైమాక్స్‌ను ఎగ్జిక్యూట్ చేయటం.. ప్రేక్షకులను ఒప్పించటం అంత సులభం కాదు. అందుకనే ఈ మూవీ క్లైమాక్స్ మీద కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. ప్రేక్షకులకు క్లైమాక్స్‌లో చాలా ఆసక్తికరమైన విషయాలు చూపించబోతున్నాం అని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ క్లైమాక్స్ గురించి చాలా కాలం చెప్పుకుంటారని తెలిపారు. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఇలా చెప్పడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయని చెప్పచ్చు. ఈ భారీ పిరియాడిక్ మూవీని 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మరి.. బాహుబలి చిత్రం వలే రాధేశ్యామ్ కూడా చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.











