భౌతిక దాడులతో ఆశయాలను అణచలేరు!
రాజధాని అమరావతి తుళ్లూరు లో ప్రారంభమైన మహా పాదయాత్ర అధికారపార్టీ సృష్టించే ఎన్నోవడిదుడుకులను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి ప్రకాశం జిల్లాకు చేరుకుంది. అయితే గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో అలా ఎంటర్ అయ్యిందో లేదో .. రైతులపై భౌతిక దాడులకు స్కెచ్ వేశారు. అధికార పార్టీ వత్తుళ్లతో పోలీసులు మఫ్టీలో ఉండిమరి దాడికి యత్నించారు. పాదయాత్రపై దుష్టశక్తుల దాడులు జరగకుండా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు .. భగ్ననానికి ప్రయత్నించారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించి సమానత్వాన్ని ప్రదర్శించాల్సిన పోలీసులు వివక్ష చూపారు. శనివారం గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ప్రకాశం జిల్లా చిననందిపాడుకు చేరుకుంది. అక్కడనుంచి కొనసాగుతున్న మహాపాదయాత్రకు గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు,యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి రైతులకు సంఘీభావం తెలిపి, బ్రహ్మరథం పట్టారు. దీంతో అడుసుమల్లి వద్ద భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడే పాదయాత్ర భగ్నానికి స్కెచ్ వేశారు.
నిఘా పెట్టాల్సిన వారే నాటకాలకు తెరతీస్తే ఎలా?
పర్చూరు వైజంక్షన్ లో మఫ్లీ ఉన్న పోలీసులు పాదయాత్రలో పాల్గొన్నవారి ఫోటోలు, డ్రోన్ కెమేరాతో రైతుల కదిలికలను ఏదో నేరాలు – ఘోరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలో మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ కు, రైతులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రైతులపై కేసు పెట్టారు. హైకోర్టు ఆదేశాలను, డీజీపీ ఉత్తర్వులను ఉల్లఘించారంటూ పాదయాత్ర నిర్వాహకులకు పోలీసులు సంజాయితీ నోటీసులు ఇచ్చారు. వేలాల్లో తరలివచ్చి పాదయాత్రను ఆధరిస్తుంటే రైతులను బాధ్యులను చేస్తే ఏలా? అని అమరావతి జేఏసీ నాయకులు వాపోయారు. పర్చూరు బొమ్మల కూడలికి వద్దకు రాగానే చీరాల ఎస్డీవో పేరుతో పాదయాత్ర నిర్వాహకులు శివారెడ్డి, నాగరాజు తదితరులకు నోటీలు అందజేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలలో ఉందని గుర్తుచేశారు. పాదయాత్రలో వినియోగించిన కళాకారులు వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులపై రాజకీయాలు మానండి .. !
రాజధానిని కాపాడుకోవాలని, అమరావతిలో 690 రోజులు నుంచి రైతులు దీక్షలు చేస్తూ .. శాంతియుత, ఆధ్యాత్మిక వాతావరణంలో పాదయాత్ర చేస్తుంటే రైతుల యాత్రను భగ్నం చేయాలని రాజకీయాలు చేయడం అమానుషం. తిరమల గోవిందుడి వద్ద తమ గోడు చెప్పుకుందామని పోతుంటే దానిపై కూడా రాజకీయాలు పులుమడం దారుణమని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతు మహా పాదయాత్రపై అధికారపార్టీ కనుసన్నల్లో జరుగుతున్న కుట్రలు, పోలీస్ చర్యలు గర్హనీయం. అధికారపార్టీ ర్యాలీలు, పదవీ ప్రమాణస్వీకారోత్సవాలు, సభలకు వాడే స్పీకర్ల చేసే శబ్ధ కాలుష్యం ఇంతకన్నా పది రెట్లు ఎక్కవగా ఉంటుంది. మరి వాటిలేని శబ్ధ కాలుష్యం మా స్పీకర్లకే ఎందుకు వచ్చిందని పోలీసులను రైతులు నిలదీస్తున్నారు. మరి అవేమి మీకు కనిపించవా? అని రైతులు సంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే .. ఉద్యమం ఉద్ధృతం చేస్తామని జగన్ ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరిస్తున్నారు.










