ప్రేమించి మోసం చేశాడని హెచ్ఆర్సీలో ప్రియుడిపై ఫిర్యాదు చేసిన బాధితురాలు. హెచ్ఆర్సీ కార్యాలయంలో పోలీసులు చూస్తుండగానే బాధితురాలిపై దాడికి పాల్పడిన అశోక్. బాధితురాలి ఫిర్యాదుతో ప్రియుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కార్యాలయం ఎదుటే ప్రియుణ్ణి నిలదీశిన యువతి. ఎందుకు మోసం చేశావంటూ ప్రశ్నించడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించిన అశోక్‌ను అడ్డుకుని బాధితురాలు ప్రశ్నించడంతో ఆమెపై దాడి చేశాడు అశోక్.
ప్రియుడిని నిలదీసిన బాధితురాలు
పోలీసుల ఎదుటే బాధితురాలు.. ప్రియుడిని నిలదీయడంతో అతను ఆమెపై చేయిచేసుకున్నాడు. దాడిలో ఆమె చేతిపై చిన్న గాయాలు అయ్యాయి. పోలీసులు విషయాన్ని అదుపు చేయడానికి చాలా ప్రయత్నించారు. చివరికి అతనిని అదుపులోకి తీసుకుని బాధితురాలికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు.