గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. తెనాలిలోని పాండురంగపేటలో 418 గజాల స్థలానికి సంబంధించి కె.చంద్రమోహన్, తెనాలి మార్కెట్ యార్డు ఛైర్మన్ భర్త ఎలవర్తి సాంబశివరావుకు మధ్య 22 సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది.
ఇవాళ కోర్టులో వాయిదాకు హాజరుకావాల్సిన సమయంలో వైసీపీ నేత ఎలవర్తి సాంబశివరావు, కె.చంద్రమోహన్ పై కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో చంద్రమోహన్ కు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డువచ్చిన బాధితుడి తండ్రిపైగా సాంబశివరావు దాడికి దిగాడని చంద్రమోహన్ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.











