‘బాహుబలి’ బ్రహ్మాండ విజయంతో రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా ప్రాజెక్టుల స్థాయికి పెరిగిపోయింది. ప్రస్తుతం అతడితో ఎవరు సినిమా తీసినా.. నిర్మాణం ఆ స్థాయికి తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ లోని మిగిలిన స్టార్ హీరోలకు ఇది మింగుడు పడని వ్యవహారమే. అలాంటి ప్రభాస్ తో వైజయంతి మూవీస్ వారు ఓ భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణేను కూడా కన్పామ్ చేశారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ ను ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ ప్రత్యేక పాత్ర పోషింబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాలో నటించడానికి అమితాబ్ అంత తేలిగ్గా ఓప్పుకోలేదట. ఈ సినిమా కోసం ఆయన దాదాపు రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మామూలు గా ఆయన బాలీవుడ్ లో ఒకో సినిమాకి రూ. 5కోట్లు అందుకుంటారు. అలాంటిది ఆయన ఒకేసారి అంతటి స్థాయిలో పారితోషికం అందుకోవడం బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రభాస్ సినిమాకి అమితాబ్ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో హైటైల్ కానుందో చూడాలి.











