టీడీపీ మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఒకప్పుడు నావలు, పడవల తయారీలో పేరు సంపాదించిన ఆయన, తరువాత నవీన ఇండస్ట్రీస్ ద్వారా రైస్‌మిల్లులకు అవసరమైన విడి భాగాలను తయారు చేసేవారు. టీడీపీ ఏర్పడ్డ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి పనిచేశారు. కొన్నాళ్లు మచిలీపట్నం అర్బన్ బ్యాంకు అధ్యక్షులుగా పనిచేసిన 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మత్స్యశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మత్స్యకారుల ఇబ్బందులను స్వయంగా చూసిన ఆయన వాళ్ల కోసం శిక్షణశాలలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగునున్నాయి. నడకుదిటి నరసింహారావు మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన ఇతర అనారోగ్యంతో చనిపోయారా… లేక కరోనా వల్ల కన్నుమూశారా…? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:టీడీపీ లక్ష్యంగా సోము వీర్రాజు ట్వీట్