వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై ఏపీ పోలీసుల సంఘం తీవ్రంగా విరుచుకుపడింది.. వైసీపీ నేత, మాజీ ఎమ్ఎల్ఏ వల్లభనేని వంశీని పరామర్శించి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల అధికారులలో అలజడి రేపాయి.. తమ నేతలను అరెస్ట్ చేసిన అధికారులను వదిలి పెట్టేది లేదని, వారు రిటైర్ అయినా, పక్క రాష్ట్రాలకు డిప్యూటేషన్ మీద వెళ్లినా.. రాష్ట్రానికి తీసుకువచ్చి మరీ శిక్షిస్తామన్న వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.. జగన్ తప్పు మాట్లాడుతున్నారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి..
తమను బెదిరించే రీతిలో జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది.. తమ మనోభావాలను, ఆత్మస్థయిర్యాన్ని జగన్ దెబ్బతీశారని విరుచుకుపడ్డారు.. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయిన తర్వాత తమను బట్టలూడ దీసి తీసుకువస్తాను అనడం అభ్యంతరకరమని మండిపడ్డారు పోలీసుల సంఘం అధికారులు లేఖలో తూర్పారబట్టారు… 8 నెలల క్రితం వైసీపీలో పనిచేసిన అధికారులే నేటికీ విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వారిని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు పోలీస్ అధికారులు..
జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎవరిపై ఎలాంటి కేసు పెడతారో, ఏ అర్ధరాత్రి, తెల్లవారుఝామున సమయంలో ఇంటి గోడలు దూకి అరెస్ట్ చేస్తారో అని టీడీపీ నేతలు వణికిపోయేవారు.. ఎలాంటి తప్పు చేయకపోయినా, వారిని టార్గెట్ చేసి మరీ కేసులు పెట్టేవారు.. మాజీ మంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 2 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని అర్ధరాత్రి బుల్డోజర్లతో ఆయన ఇంటి గోడలని బద్దలు కొట్టారు అధికారులు.. ఇక, అచ్చెన్నాయుడు గుండె ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పినా వినకుండా, ఓ టెర్రరిస్టులా అర్ధరాత్రి ఇంటిపైకి వచ్చి అరెస్ట్ చేయించారు వైసీపీ నేతలు.. ఈ కేసు క్షణాలలో వీగిపోయింది..
ఫేక్ కేసులకే బాబు కేసుగా ముద్ర పడిన కేసు…. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నాటి జగన్ సర్కార్ మోపిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు.. ఈ కేసులో చిన్న ఆధారం లేకుండా, కేవలం పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికే చంద్రబాబుని జైలులో పెట్టించారు వైసీపీ అధినేత అనే కామెంట్స్ వినిపించాయి.. దీనికి జగన్ అంతకు అంత అనుభవించారు.. చివరికి 11 స్థానాలతో సరిపెట్టుకున్నారు..
వైసీపీ నేతలపై ఉన్న కేసులు అలాంటివి కావు.. వల్లభనేని వంశీ, సత్యవర్ధన్‌ని ఎంత దారుణంగా బెదిరించారో, వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు టీడీపీ కార్యాలయంపై ఏ స్థాయిలో ఎటాక్ చేశారో క్లియర్‌గా వీడియో సాక్ష్యాలే ఉన్నాయి.. దీంతో, తమ వారిని కాపాడుకోవడం ఎలానో జగన్‌కి అర్ధం కావడం లేదు.. ఆయన మైండ్ బ్లాంక్ అవుతోంది.. నాడు జగన్ చేసిన తప్పులు నేడు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకి శాపంలా మారుతున్నాయి.. దీంతో, ఆ పార్టీ కేడర్‌లో నైరాశ్యం ఎదురవుతోంది.. పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతోంది.. ఈ పరిణామాల నుండి దృష్టి మరల్చడానికే జగన్…. పోలీసులపై ఎటాక్ చేస్తున్నారు.. కానీ, ఇలాంటి ఉడత ఊపులకు అధికారులు భయపడరు.. తప్పులు కనిపిస్తే అధికారులు వదలరు… అందుకే, వారిని ఎటాక్ చేయడానికి నిర్ణయించుకున్నాడు జగన్.. ఇది పోలీసులకు బాగా తెలుసు.. అందులోనూ జైలు ఖైదీ అయిన జగన్ వేషాలు వారికి కరతలామలకం.. తాజాగా, అధికారులు ఇచ్చిన డోసేజ్తో అయినా జగన్‌లో మార్పు వస్తుందేమో చూడాలి.. లేదంటే, ఆయనని కూడా జైలు శిక్ష అనుభవించక తప్పకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..











