రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి మరణించారు. బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మరణించారు.
బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మృతి పట్ల పలువురు నాయకులు, ఆయన అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు సానుభూతి తెలియజేశారు.
బొత్స ఈశ్వరమ్మ (87)కు ఏడుగురు కుమారులు. పెద్ద కొడుకు బొత్స సత్యనారాయణ పురపాలక శాఖ మంత్రి కాగా, రెండో కొడుకు అప్పలనరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలో ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆమె అంత్యక్రియలు జరుగుతాయి.