అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జీఏ2 ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిస్తున్నారు. అయితే.. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
అయితే.. సంక్రాంతి వస్తుంది కానీ.. ఈ మూవీ టీమ్ మాత్రం ఎలాంటి సందడి చేయకుండా సైలెంట్ అయ్యింది. దీంతో సంక్రాంతికి ఈ బ్యాచ్ లర్ ప్రేక్షకుల ముందుకు రావడం లేదని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. కారణం ఏంటంటే.. ఓ సీరియల్ హీరో తనే సొంతంగా ఓ సినిమాని చేసాడు. ఆ మూవీని దిల్ రాజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ మూవీ స్టోరీ, ఈ సీరియల్ హీరో నిర్మించిన మూవీ స్టోరీ ఒకేలా ఉన్నాయట.
ఈ విషయం బయటకు రావడంతో కథలో మార్పులు చేస్తున్నారని.. ముఖ్యంగా సెకండాఫ్ లో చాలా ఛేంజస్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మోస్ట్ఎలిజిబుల్ బ్యాచ్ లర్ పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదైనా అఖిల్ కి సక్సస్ ఇస్తుంది అనుకుంటే.. ఇప్పుడు ఇలా ప్రాబ్లమ్ వచ్చింది. మరి.. కథలో మార్పులు చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారో..? ఎలాంటి ఫలితం ఇస్తుందో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.