మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా చారిత్రాత్మక చిత్రం ‘మరక్కార్ : అరబిక్కడలిండే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేష్, మంజు వారియర్, సునీల్ శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 16వ శతాబ్ధానికి చెందిన కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
ఇందులో మోహన్‌లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ నటించడం విశేషం. మహానటి సినిమాతో జాతీయ అవార్డ్ సైతం అందుకున్న కీర్తి సురేష్ ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ లుక్ కు అనూహ్యమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో అయితే.. అర్చ అదిరింది అంటూ కీర్తి సురేష్ క్యారక్టర్ గురించి కామెంట్స్ వచ్చాయి.
ఈ మూవీ ట్రైలర్ ను తెలుగులో చిరంజీవి, తమిళ్ లో సూర్య, కన్నడలో యాశ్ రిలీజ్ చేయగా మలయాళంలో మెహన్ లాల్, హిందీలో అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచిందని చెప్పచ్చు. రిలీజ్ విషయానికి వస్తే.. ఈ మూవీని మార్చి 26న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు అఫిసియల్ గా ఎనౌన్స్ చేశారు. మరి.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న మరక్కర్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి..