బాలీవుడ్ హీరోయిన్ దిషా పటాని, టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ లో ఉందని బాలీవుడ్ మీడియా వరుస కథనాలు వినిపిస్తున్నా… దిశా పటాని కాని టైగర్ ష్రాఫ్ కాని ఏవిధంగా స్పందించలేదు. అభిమానులు కూడా వీరిద్దరి మధ్య ఏముందో తెలియక అయోమయంలో ఉన్నారు. అయితే దిశా పటాని కొత్త సంవత్సర వేడుకల కోసం టైగర్ ష్రాఫ్ తో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ ఆ ఇద్దరూ కలిసి దిగిన అనేక పోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది దిషా పటాని. ఆ ఫోటోలు చూసిన అభిమానులు .. ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు.

మాల్దీవుల నుండి ఈ మధ్యనే ముంబయి తిరిగి వచ్చిన ఈ జంట మళ్ళీ ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు. తాజాగా దిశా పటాని మరో కొత్త ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. మాల్దీవుల్లో ఉన్నప్పుడు ఈ ఫోటో క్లిక్ చేయబడింది. దిశా ఇందులో చాలా బోల్డ్ గా ఉంది . శరీరంపై తెలుపు షర్ట్ ను తగిలించినట్టుగా వేసుకొని అద్భుతంగా రివీలైంది. దానికి తోడు చేతికి వెండి రంగు చైన్ పెట్టుకొని, జుట్టును గాలికి వదిలేసి హాట్ లుక్ లో ఉంది దిశా. ప్రస్తుతం ఆమె ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
నెటిజన్లు ఆమె అందానికి ముగ్దులు అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ అందాల దేవత వలే ఉందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం దిశా సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘రాధే.. యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా.. ఏక్తా కపూర్, మోహిత్ సూరి సినిమాలలో కూడా నటించబోతోంది.











