ఏపీలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టించేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో లక్షల జీతాలు తీసుకుంటూ ఓ వ్యక్తి రాచకార్యాలు వెలగబెడుతున్నాడని అర్థం వచ్చేలా, వైసీపీ ఎంపీ రఘురామకృష్టం రాజు సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ అవినాష్ అనే సదరు వ్యక్తి.. ‘మ్యాన్ బిహైండ్’ అటూ అభివర్ణించారు.
ఏ కొద్ది మందికో తప్ప ‘ట్రంప్ అవినాష్’ అంటే ఎవరో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో ఎవరైనా సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిపై సీబీసీఐడీ కేసులు పెట్టించి వారిని వేధించడమే అవినాష్ రోజువారీ కార్యక్రమం అని ప్రచారంలో ఉంది.. వెబ్ సైట్లు, ఫేస్ బుక్ పేజీలు, యూట్యూబుల్లో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారికి 41 నోటీసులు జారీ చేయించడం వారిని విచారణ పేరుతో వేధించడమే ఈ వ్యక్తి డ్యూటీ అని విమర్శలున్నాయి.. ఇందుకు గాను అవినాష్ కు ప్రభుత్వం భారీగానే ప్రజల సొమ్ము జీతాల రూపంలో కట్టబెడుతోందని తెలుస్తోంది.
రెచ్చగొట్టడం, చిచ్చు పెట్టడం
ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే వెబ్ సైట్ల యాజమాన్యాలను వేధించడం, మరో వైపు ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసే విధంగా వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టడం ట్రంప్ అవినాష్ కు వెన్నతో పెట్టిన విద్యట. అందుకే ఏరికోరి సీఎం క్యాంపు కార్యాలయంలో లక్షల రూపాయల జీతాలు ఇచ్చి నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఏడాది కిందట ఉండవల్లిలో టీడీపీ అధినేత ఇంటిపై అనుమతులు లేకుండా డ్రోన్ లు ఉపయోగించి చిత్రీకరించిన కిరణ్ అనే వ్యక్తి కూడా అవినాష్ టీంలో పనిచేస్తున్నాడని తెలుస్తోంది. వీరంతా ప్రతిపక్షాలను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సోషల్ మీడియాను, వెబ్ సైట్ల యాజమాన్యాలను వేధించడమే వీరి లక్ష్యంగా పెట్టుకున్నారని సాక్షాత్తూ వైసీసీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మీడియాకు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.
పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు వచ్చినా.. నానా రగడ చేసే సీబీసీఐడీ.. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు వచ్చినా.. పట్టించుకోలేదని, చివరికి ఆ శాఖకు సారథ్యం వహించే సునీల్ అన్ ఫిట్ అని కోర్టు భావించి కేసుల్ని సీబీఐకు అప్పగించిందని కూడా ఆర్ఆర్ఆర్ అన్నారు.
హిందూ దేవాలయాల కేసు సీఐడీకి వద్దు
హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్న కేసుల్లో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే గనుక.. ఆ కేసును ఒక క్రిస్టియన్ ఉన్నతాధికారిగా ఉన్న సీఐడీకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని ఆర్ఆర్ఆర్ అభిప్రాయపడ్డారు. రికార్డుల్లో ఎలా ఉందో తనకు తెలియదు గానీ.. వాస్తవానికి క్రిస్టియానిటీని పాటించే డీజీపీ, సీఐడీ చీఫ్, ముఖ్యమంత్రి ఉండగా.. న్యాయం జరగదని అన్నారు. దేవాలయాలపై దాడుల కేసులను తేల్చాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే గనుక.. ఒక విచారణకు కొత్త కమిటీ ఏర్పాటుచేసి.. నాన్ క్రిస్టియన్, నాన్ రెడ్డి వ్యక్తిని దానికి ఉన్నతాధికారిగా నియమిస్తేనే వీలవుతుందన్నారు. ఆ కమిటీసారధిగా ఏ కులం వారైనా పర్లేదు గానీ.. నాన్ క్రిస్టియన్, నాన్ రెడ్డి అయి ఉండాలని చెప్పారు.
రఘురామక్రిష్ణ రాజు లేటెస్టుగా విడుదల చేసిన వీడియో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
https://youtu.be/ky58oMpNGpk











