ఆయన బో అని పెంపుడు కుక్క ఉంది. ఫ్యామిలీ తో ఆయనకు ఎంత అటాచ్ మెంట్ ఉందో.. బోతోనూ అంతే ఉంది. అందుకే ఆయన ఎంతబిజీగా ఉన్నా సరే పెట్ తో ఆడుకోవడానికి సమయం కేటాయిస్తాడు. అయితే పెంపుడు శునకం ‘బో’.. క్యాన్సర్తో పోరాడుతూ శనివారం మృతిచెందింది. ఈ విషయాన్ని ఒబామా, ఆయన భార్య మిషెలీ ఒబామా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ బో మరణంపట్ల విచారం వ్యక్తం చేశారు. ‘నా నిజమైన స్నేహితుడు, నమ్మకమైన సహచరుడిని కోల్పోయానంటూ’ ఒబామా భావోద్వేగానికి లోనయ్యారు. బో మృతి తమను తీవ్రంగా కలిచి వేసిందని, బోతో గడిపిన సమయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని మిషెలీ, ఒబామా తెలిపారు.
Today our family lost a true friend and loyal companion. For more than a decade, Bo was a constant, gentle presence in our lives—happy to see us on our good days, our bad days, and everyday in between. pic.twitter.com/qKMNojiu9V
— Barack Obama (@BarackObama) May 8, 2021











