మరో రెండు రోజుల్లో వినాయక చవితి రాబోతోంది. ఈ సందర్భంగా హీరో మోహన్ బాబు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అదేంటంటే ఆయన గళంతోనే వినాయక పూజా విధానం మన ముందుకు రాబోతోంది. ఏటా మంచు కుటుంబం వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంది. ఈసారి ఈ పండుగ పూజా విధానం మీద మంచు కుటుంబం ఓ వీడియో చేయబోతోంది. మోహన్ బాబు గళానికి ఉన్న ప్రత్యేకత మనకు తెలుసు అన్ని మతాలనూ ఆయన గౌరవిస్తారు. ముఖ్యంగా ఆయనకు షిరీడీ సాయిబాబా అంటే భక్తి ఎక్కువ. అయినా అన్నీ మతాలనూ ఆయన గౌరవిస్తారు. పండుగకు ఒక రోజు ముందు అంటే ఈనెల 21వ తేదీన ఈ వీడియో విడుదల చేయటానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. మోహన్ బాబు గళంతో వచ్చే పూజా విధానాన్ని వింటూ మనం ఈసారి వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకోవచ్చన్న మాట.
పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?
అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మవవీగా రికార్డు సృష్టించిన...