టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నిర్మాత అకస్మాత్తుగా మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. కె.ఎఫ్.సి. అధినేతగా పేరుపొందిన కమలాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయనకు సినిమా పరిశ్రమలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కరోనా వచ్చాక ఆయన నెల్లూరు సమీపంలోని తమ సొంతూరులో ఉంటున్నారు. ఆయన తండ్రి నందగోపాల్ రెడ్డికి కూడా కరోనా సోకింది. దాంతో తండ్రిని తీసుకుని హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న అంబులెన్స్ ను లారీ ఢీకొనడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. దుల్కర్ సల్మాన్, రితూ వర్మ జంటగా మలయాళంలో రూపొందిన సినిమాను ఆయన ఇటావల తెలుగులోకి అనువదించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఠాగూర్ మధు లాంటి నిర్మాతలకు ఆయన సన్నిహితుడు. ఈ మరణం సినిమా పరిశ్రమలో చాలామందిని కలచివేసింది.
మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...











