గ్వాలన్ లోయలో చైనాతో ఏర్పడ్డ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో స్వదేశీ ఉద్యమం మొదలయింది. చైనాకు చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండులు వినబడ్డాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 59 యప్ లను మన దేశం నిషేదించింది. ఇదే సమయంలో 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ కు స్పాన్సర్ షిప్ గా వ్యవహరిస్తున్న వివోని కూడా తొలగించాలని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. బీసీసీఐ అందుకు ఒప్పుకోకున్నా ఈ ప్రచార నేపథ్యంలో వివో స్వచ్ఛందంగా తప్పుకుంది. దీంతో బీసీసీఐ స్పాన్సర్ షిప్ కోసం కొత్త కంపెనీలను ఆహ్వానించింది. టీమిండియాకు స్పాన్సర్ గా ఉన్న బైజూస్, బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ, ముంబైకు చెందిన గేమింగ్ యాప్ డ్రీమ్ 11, కోకాకోలా కంపెనీ, ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, రిలయన్స్ జియో పోటీ పడ్డాయి. కానీ ఈ సీజన్ కు 222 కోట్ల భారీ మొత్తం చెల్లించి డ్రీమ్ 11 స్పాన్సర్ షిప్ ను సొంతం చేసుకొంది.
ఇంత వరకు బాగానే ఉంది కానీ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బెట్టింగ్ ను నిషేధిస్తామని గొప్పలు చెప్పుకొనే బీసీసీఐ బెట్టింగ్ యాప్ కు ఈ హక్కులను ఎలా ఇచ్చిందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ కు లైసెన్స్ ఇచ్చేశారా అంటూ పలువురు క్రీడా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే గాకుండా డ్రీమ్ 11 సంస్థలో చైనా సంస్థ పెట్టుబడులు ఉన్నాయని నెటిజన్స్ తమ వాదనను వినిపిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు బదులుగా చైనా టెన్సెంట్ హోల్డింగ్స్ అనే సెర్చ్ ఇంజిన్ ను వాడుతోంది. చైనా దిగ్గజ కంపెనీ టెన్సెంట్ హోల్డింగ్స్ డ్రీమ్ 11 లో పెట్టుబడులు పెట్టిందని ఆధారాలతో సహా వారు బయట పెట్టారు. చైనా సంస్థతో సంబందాలున్నా సంస్థతో ఎలా ఒప్పందం చేసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరు బీసీసీఐకి ఈ విషయం తెలుసని కామెంట్ చేస్తుండగా మరి కొందరు బెట్టింగ్ కు అనుమతి ఇచ్చేందుకే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు. తాము తీసుకున్న నిర్ణయంపై వివాదాలు రేగడంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి. దుబాయ్ వేదికగా ఈ టోర్నీ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం విదితమే.











