హీరోయిన్ రకుల్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈమధ్య అవకాశాల విషయంలో కాస్త వెనుకబడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ స్టార్ హీరోయిన్ పవన్, ప్రభాస్ మినహా వరుసగా స్టార్ హీరోలు, యువ హీరోలతో సినిమాలు చేసింది. ఫుల్ స్పీడ్ లో ఉన్న రకుల్ కెరీర్ ఏడాది కాలంగా సరైన ట్రాక్ లో నడవట్లేదు. దీంతో ఈ గ్యాప్ లో తన కాన్సంట్రేషన్ హిందీ, తమిళ్ సినిమాలు వైపు మళ్లించింది రకుల్. అక్కడ ఏజ్ బార్ హీరోలు, కాస్త ఎబోవ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉంది. దీంతో తెలుగుకి రకుల్ ఆల్మోస్ట్ దూరమైంది అనే వార్తలు నిన్న మొన్నటి వరకు హల్ చల్ చేశాయి.
ఐతే తాజాగా రకుల్ కి తెలుగు లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. స్టార్ డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. రాక రాక వచ్చిన ఈ క్రేజీ ఆఫర్ ని యూజ్ చేసుకోవడానికి రకుల్ సంపూర్ణంగా ట్రై చేస్తోంది. ఈ క్రైసిస్ లో యే హీరోయిన్ కూడా షూటింగ్ కి రావడానికి ఇష్ట పడటం లేదు, కానీ రకుల్ మాత్రం ధైర్యంగా షూటింగ్ కి వస్తాను అని నిర్మాతలకు తెలిపినట్లు సమాచారం. నిజానికి ఇలా షూటింగ్స్ కి ఎవరూ రాలేము అని వేరే హీరోయిన్స్ చెప్పాకే రకుల్ తో సంప్రదింపులు జరిపి మరీ సెలెక్ట్ చేసుకున్నారట క్రిష్ అండ్ టీం. అంతే ఈ ఆఫర్ ని బేస్ చేసుకొని మరిన్ని తెలుగు అవకాశాలు కొట్టేయడానికి రకుల్ పాత్ర డిమాండ్ చేస్తే దేనికైనా సిద్ధం అని సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.