ఒకవైపు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. మరోవైపు సీనియర్ దినేష్ కార్తీక్. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితీ ఒకేలా ఉంది. ఇద్దరూ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నారు. తమ జట్లను ముందుండి నడిపించలేకపోతున్నారు. స్టార్ ఆటగాళ్లున్నా టీమ్‌ను నడిపించడంలో కార్తీక్ విఫలమవుతుంటే.. మరోవైపు సీనియర్ ఆటగాళ్లతో ధోనీ సతమతమవుతున్నాడు. వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూర్ కింగ్స్ మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ బుధవారం జరుగనుంది. మరి, ఎవరి పరిస్థితి మెరుగుపడుతుందో చూడాలి.
దినేష్ కార్తీక్ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కెప్టెన్సీ పరంగానూ విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు కార్తీక్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా బెడిసికొడుతున్నాయి. దీంతో కార్తీక్‌ను తప్పించి ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కోల్‌కతా మేనేజ్‌మెంట్ కార్తీక్ పైనే నమ్మకముంచింది. ఇక, గత మ్యాచ్‌లో ఫిట్‌నెస్ పరంగా ధోనీ పడిన ఇబ్బందులు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ధోనీ అలసిపోవడంపై బోలెడు మీమ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ ఇరు టీమ్‌ల కెప్టెన్లూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. మరి, బుధవారం సాయంత్రం 7:30 గంటలకు షార్జా స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.
కోల్‌కతా బలాలు
ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌లలో కోల్‌కతా ఒకటి. శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్ వంటి స్టార్స్ బ్యాటింగ్‌లోనూ, ప్యాట్ కమ్మిన్స్, శివం మావి, నాగర్కోటి, వరుణ్ వంటి సమర్థులు బౌలింగ్ విభాగంలోనూ ఉన్నారు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా మెరుగ్గానే రాణిస్తోంది. చివరగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచినంత పనిచేసింది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి 210 పరుగులు చేసింది. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే చివర్లో అదృష్టం కలిసి రాక ఓటమి పాలైంది. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా వినియోగించుకుంటే కోల్‌కతా మెరుగైన టీమ్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
బలహీనతలు
నాయకుడు దినేష్ కార్తీక్ వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు కెప్టెన్‌గా కార్తీక్ విఫలమవుతున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు విమర్శలపాలయ్యాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని కార్తీక్ సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లే ఢిల్లీ భారీ స్కోరు చేయగలిగిందని విమర్శలు వచ్చాయి. అలాగే భారీ ఛేజింగ్‌లో ఇయాన్ మోర్గాన్‌ను ముందుగా పంపకపోవడం కూడా తప్పుడు నిర్ణయంగా మారింది. మోర్గాన్‌కు మరిన్ని ఓవర్లు అందుబాటులో ఉండుంటే కోల్‌కతాకు విజయావకాశాలు పుష్కలంగా ఉండేవని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లందరూ తీవ్రంగా నిరాశపరిచారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆండ్రూ రస్సెల్ తప్ప అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారీ ధర వెచ్చించి దక్కించుకున్న కమిన్స్ నిరాశపరుస్తున్నాడు.
కోల్‌కతా జట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రాణా, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, శివం మావి, నాగర్కోటి, వరుణ్, రాహుల్ త్రిపాఠి.
చెన్నై టీమ్ బలాలు
వరుస పరాజయాలతో సతమతమైన చెన్నై టీమ్‌లో తాజా విజయం ఆత్మవిశ్వాసాన్ని నింపింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్ల తేడాతో విజయం సాధించడం చెన్నై సత్తాను రుజువు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండా చెన్నై ఛేదించింది. ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ అద్భుత ఆటతీరుతో చెలరేగారు. వీరు ఇదే ఆటతీరు కొనసాగిస్తే చెన్నైకి తిరుగుండదు. వికెట్లు తీయలేకపోయినా చెన్నై బౌలర్లు మెరుగైన బౌలింగ్ ప్రదర్శనే చేశారు. 200 పరుగులు దాటుతుందనుకున్న పంజాబ్‌ను 178 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్, జడేజా, పియూష్ చావ్లా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇదే ఆటతీరు కొనసాగిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్సులు చెన్నైకి పుష్కలంగా ఉన్నాయి.
బలహీనతలు
చెన్నై టీమ్‌కు ప్రధాన బలమైన కెప్టెన్ ధోనీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఫిట్‌నెస్ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. గత మ్యాచ్‌లో కీపింగ్ చేయడానికి ధోనీ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇది చెన్నై టీమ్‌లో ఆందోళన నెలకొల్పుతోంది. ఇక, చెన్నై టీమ్ వ్యక్తిగత ప్రదర్శనలపైనే తప్ప సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. ఓపెనర్లు విఫలమైతే తర్వాత బాధ్యత తీసుకునే వారు కరువయ్యారు. మిడిలార్డర్ బలహీనంగా కనబడుతోంది. సురేశ్రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
చెన్నై జట్టు (అంచనా)
వాట్సన్, డుప్లెసిస్, రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, జడేజా, బ్రావో, కర్రన్, శార్దూల్ ఠాకూర్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్.
మ్యాచ్ ఫేవరెట్
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే చెన్నై కంటే కోల్‌కతా టీమ్ బలంగా కనబడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు చెన్నై కంటే కోల్‌కతాకే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే గత మ్యాచ్‌లో లాగా చెన్నై స్ఫూర్తివంతమైన ఆటతీరు ప్రదర్శిస్తే కోల్‌కతాకు కష్టాలు తప్పవు.











