అన్న నడిచొస్తే మాస్ అన్నట్లుగానే ఉంది జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి. ఆ మధ్య ఆయన మాస్క్ పెడితే దాని మీద పెద్ద వార్త. ఆయన కారు కొంటే అదో వార్త. ఇప్పుడు ఏకంగా ఆయన వాచ్ కు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అయితే అందరినీ ఆకర్షిస్తున్న విషయం ఏమిటంటే ఎన్టీఆర్ చేతిని ఉన్న గడియారం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వాచ్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏదైనా మంచి వస్తువు కంట బడితే దాన్ని కొనడానికి ఆయన వెనుకాడరు.
అలా విలువైన వస్తువులు ఎన్నో ఆయన వద్ద ఉన్నాయి. అప్పుడప్పుడూ అవి వార్తల్లోకి వస్తుంటాయి. ఇక ఈ వాచ్ వివరాల్లోకి ఇది రిచర్డ్ మిల్లే ఆర్ఎంకు చెందిన 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రోస్టీన్ వాచ్ గా చెప్పాలి. ఇది చాలా ఖరీదైనది. ఇలాంటి వాచ్ లలో రోజ్ గోల్డ్ లోటస్ ఎఫ్ 1 టీమ్ లిమిటెడ్ ఎడిషన్ కూడా ఇంకా ఎక్కు ఖరీదైనది. వీటి ధర గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధర దాదాపు నాలుగు కోట్లు అంటున్నారు. ఇలాంటి వాచ్ లు రెండు ఎన్టీఆర్ దగ్గర ఉన్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ సినిమా ప్రచారం కన్నా ఈ వాచ్ ప్రచారం ఎక్కువైంది. గతంలో ఎన్టీఆర్ పుట్ఠిన రోజున కళ్యాణ్ రామ్ రెండు కోట్ల రూపాయల వాచ్ ను బహూకరించినట్టు వార్తలొచ్చాయి. కాబట్టి ఎన్టీఆర్ దగ్గర మొత్తం ఎన్ని వాచ్ లు ఉన్నాయో లెక్క తీయడం కష్టం. అది ఆయనకే తెలియాలి. వాచ్ ధర ఇంత ఎక్కువగా ఉందంటే అందులో ఉండే ప్రత్యేకతలు ఎలా ఉంటాయో చూడాలి.











