షెకావత్, పీయూష్ వాఖ్యలు దేనికి సంకేతం..!
ఏపీ పరువు, ప్రతిష్టను జగన్ రెడ్డి జాతీయ, అంతర్జాయ స్థాయిలో దిగజార్చుతున్నారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవంబిస్తున్న ఆర్థిక విధానాలను చట్టసభల్లో కేంద్ర మంత్రలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మొన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, నీటి ప్రాజెక్ట్స్ నిర్వహణ బాధ్యతలు ఏపీ ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చర్యలు వలన అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువుపోయిందని వాపోయ్యారు షెకావత్. మరోవైపు రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో ఏపీ సహకారం లేదని, రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతోనే రైల్వే ప్రాజెక్ట్ లు ఆగిపోయాలని కేంద్ర మంత్రి ఆరోపించారు. తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఏపీ ప్రభుత్వ చర్యలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిత్ర విచిత్ర పరిస్థితులున్నాయని, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు జగన్ ప్రభుత్వ సహాకరించలేదని ఆరోపిచారు.
అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వమే శరఘాతమా..?!
అభివృద్ధి, ఆదాయం రాష్ట్ర భవిష్యత్తుకు రెండు కళ్లు వంటివి. అటువంటిది ఆ రెండు కళ్లు నేడు పూర్తిగా గుడ్డివై, కుంటుతోంది! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి విభజిత ఏపీ వరకు గడిచిన 65 ఏళ్లల్లో 16 మంది ముఖ్యమంత్రులు పాలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక విధానాలు, ఆదాయ విధ్వంసాలు నేడు జగన్ రెడ్డి పాలనల్లో చూస్తున్నాం. కేంద్రం సహకరిస్తామంటున్న అభివృద్ధి అడ్డుకునే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేడు అన్నదే కేంద్ర మంత్రి పీయూష్ మాటల్లోని ఆంతర్యం. హైదరాబాద్ టూ బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించి ఓర్వకల్లు నోడ్, కృష్ణపట్నం నోడ్ వంటివి ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత, అవగాహన లేమి నిర్ణయాలు కారణంగానే నిలిచాయని, కాంట్రాక్టర్లు కూడా ఏపీ ప్రభుత్వం చర్యలను అభ్యతరాలు వ్యక్తం చేశారని సభకు పీయూష్ చెప్పారు. ఏపీకి ఎప్పటికప్పడు కొత్త ప్రాజెక్ట్ లు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతోనే వాటిని అమల్లోకి తీసుకురాలేక పోతున్నామని ఆయన వాపోయ్యారు. ఇలా రాష్ట్రాభివృద్ధికి ప్రత్యక్షంగా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే అడ్డుపడుతుంటే, అభివృద్థి పథంలో ఎలా ముందుకు పోతుంది? చివరికి తన హయంలో ఫలాన అభివృద్ధి జరిగింది… జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి సంస్థలను నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి చూపాను అని చెప్పుకోవటానికి జీవితంలో ఉదాహరణలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయనే జగన్ రెడ్డి, ఏపీ ప్రస్తుతం ముఖ్యమంత్రి అని ప్రజలు ప్రత్యక్షంగానే విమర్శిస్తున్నారు.