రైతుల పాదయాత్రకు విశేషస్పందన ..!
రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి రైతులు చేపట్టిన ‘న్యాయంస్థానం టూ దేవస్థానం’ మహాపాదయాత్ర శనివారం తో 41 రోజులకు చేరింది. శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమైన రైతుల పాదయాత్రకు మహారాష్ట్రలోని పుణెలో స్థిరపడిన తెలుగు రైతులు సంఘీభావం తెలిపారు. పుణె కు నుంచి పలు రైతు సంఘాల నేతలు శ్రీకాళహస్తికి చేరుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా పాదయాత్రలో నడిచి ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ఎండగట్టారు. ఇప్పటికే రైతుల పాదయాత్రకు కర్నాటక, తెలంగాణ రైతులు మద్దతు తెలిపి, పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అలానే రైతు చట్టాలపై కేంద్రంతో యుద్ధం చేసిన హర్యానా, ఢిల్లీ రైతులు కూడా రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపి, రైతులతో పాటు పాదయాత్రలో నడిచిన సంగతి విధితమే. సాటి రైతు పడుతున్న కష్టాన్ని చూడలేక కర్నాటక రైతుల సంఘం ఆధ్వర్యంలో భారీ విరాళం రూ. 60 లక్షలను అందజేసి, భరోసాను అందజేశారు. మరోవైపు రాయలసీమ ప్రజలు కూడా రైతులకు అడుగడుగునా అఖండ స్వాగతం పలుకుతూ.. పాదయాత్రను ఆధరిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి సాగిన పాదయాత్ర.. మిట్టకండి,చెర్లోపల్లి, ఇసుకగుంట, రాచగన్నెరు మేర్లపాక, ఏర్పేడు, సీతారాంపేట మీదిగా అంజిమేడు వరకు 17 కిలోమీటర్ల మేరకు రైతుల పాదయాత్ర సాగింది.











