మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయడం.. ఆతర్వాత తన ప్యానల్ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లడం తెలిసిందే. మా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని విష్ణు చెప్పడం జరిగింది. అయితే.. మా ఎన్నికల అనంతరం కూడా ప్రకాష్ రాజ్ ఎన్నికలు సజావుగా జరగలేదని.. మాకు అనుమానాలు ఉన్నాయి ప్రకటించడం జరిగింది.
ఎన్నికలు జరిగినప్పటి వీడియో ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారిని కోరడం జరిగింది. దీంతో మాలో ముసలం మళ్లీ మొదలైంది అంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. రేపు మాకు సంబంధించి ఓ శుభవార్త చెబుతాను అని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు ట్విట్టర్ లో ప్రకటించారు. దాంతో ఆ శుభవార్త ఏమై ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
శుభవార్త అంటున్నారు కాబట్టి.. వారి ప్యానల్ సభ్యులకు సంబంధించిందా..? లేక మా అభివృద్ధికి సంబంధించిందా..? ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్రకటించిన మ్యానిఫెస్టోలో హామీల లిస్ట్ పెద్దదిగానే ఉంది. ఇచ్చిన హామీల్లో దేని గురించైనా చెప్పనున్నారా..? దేని గురించి చెప్పనున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి.. ఆ శుభవార్త ఏంటో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.











