డ్రగ్స్ కేసు ఒకప్పుడు టాలీవుడ్ ని షాక్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వడం లేదు. అయితే.. ఆర్యన్ ని విచారించినప్పుడు ఓ హీరోయిన్ తో డ్రగ్స్ కోసం చాట్ చేశాడని.. వార్తలు వచ్చాయి. ఇలా వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి ఎవరా హీరోయిన్..? అంటూ ఆరా తీయడం స్టార్ట్ చేశారు మీడియా జనాలు, సినీ జనాలు. ఇప్పుడు సస్పెన్స్ కి తెర పడింది. ఆర్యన్ చాట్ చేసిన ఆ బాలీవుడ్ బ్యూటీ పేరు బయటకు వచ్చింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ, విజయ్ దేవరకొండ సరసన సరసన నటిస్తున్న అనన్య పాండే. ఈ బ్యూటీ పేరు బయటకు రావడంతో డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్‌సిబి ఈరోజు డ్రగ్స్ కేసులో అనన్య పాండేను విచారణకు పిలిచింది. అనన్య పాండేతో పాటు, ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా ఖాన్ పేరు కూడా డ్రగ్స్ చాట్‌లో కనిపించిందని సమాచారం. అనన్య పాండే ఇంటి పై దాడులు చేసిన తరువాత, ఎన్‌సిబి బృందం షారుఖ్ ఖాన్ ఇంటికి మన్నాట్ చేరుకుంది. అక్కడ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.సెర్చ్ ఆపరేషన్ కోసం షారుఖ్ ఖాన్ ఇంటికి చేరుకున్న ఎన్.సి.బి బృందం అన్ని వివరాలను సేకరించే పనిలో పడింది.
అలనాటి బాలీవుడ్ హీరో చుంకీ పాండే కూతురే అనన్య పాండే. ఇప్పుడు చాలా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ముంబై లోని మలబార్ హిల్స్ నివాసంలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. షారూఖ్ తనయుడు ఆర్యన్ కు అనన్య చాలా క్లోజ్ ఫ్రెండ్. అనన్య పాండే ప్రస్తుతం తెలుగులో లైగర్ మూవీలో నటిస్తుంది. విజయ్, అనన్య పాండే జంటగా నటిస్తున్న లైగర్ మూవీని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న లైగర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.











