పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణకు దాదాపు ఏడునెలలు బ్రేక్ పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది. కానీ పవర్ స్టార్ ఇంకా షూటింగ్ లో పాల్గొనడం లేదు. ఆయనలేని సన్నివేశాల్ని దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాడు. అలాగే శ్రుతి హాసన్ కూడా షూటింగ్ కు రావడానికి లేటయింది.
తాజాగా ఈ సినిమా కోసం పవర్ స్టార్ తిరిగి డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. ప్రస్తుతం హైద్రాబాడ్ పరిసర ప్రాంతాల్లో ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అంజలితో పాటు మరిందరు పాల్గొన్న కొన్ని ప్రాధాన సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అక్టోబర్ 26 నుంచి 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించారని సమాచారం. అప్పుడే ఆయన షూట్ లో పాల్గొనబోతున్నారట. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ‘వకీల్ సాబ్’ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.











