నటసింహ నందమూరి బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ .. బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతోన్న మూడో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. లాక్ డౌన్ కు ముందు ప్రారంభమై.. కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ కి దాదాపు ఏడునెలలు గ్యాప్ వచ్చింది. అతి త్వరలోనే తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా లో బాలయ్య రెండు పాత్రలు పోసిస్తున్నాడని.. అందులో ఒకటి అఘోరా అనే వార్తలొస్తున్నాయి.
అయితే ఇందులో కథానాయికగా చాలా మంది పేర్లు పరిశీలించాడు దర్శకుడు బోయపాటి. కానీ ఇంతవరకూ ఎవరూ ఎంపికకాలేదు. ఎట్టకేలకు ఒక మలయాళ బ్యూటీని హీరోయిన్ గా ఖాయం చేశారనే టాక్ వినిపిస్తోంది. మలయాళ చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి.. అటు గ్లామర్ పరంగానూ మంచి పేరు తెచ్చుకున్న ప్రగ్యా మార్టిన్ ఈ సినిమాలో బాలయ్యతో రొమన్స్ కు రెడీ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో బాలయ్య శోభన, మోహిని, నయనతార, మీరా జాస్మిన్ ప్రియమణి, విద్యాబాలన్ లాంటి మలయాళ ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేశాడు. త్వరలో ఈ జాబితాలోకి ప్రగ్యామార్టిన్ కూడా చేరబోతోంది. మరి ఈ ఇద్దరి జోడీ ఈ సినిమాకు ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.











