వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..? పార్టీ అధినేత జగన్ ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ తమలో తామే గిల్లికజ్జాలకి పాల్పడుతున్నారా..? తాజా పరిణామాలను చూస్తే అదే నిజం అనిపిస్తోంది..
ఏడాదిన్నరగా వైసీపీ తరఫున గట్టిగా వాయిస్ వినిపిస్తోన్న యాంకర్ శ్యామల రీసెంట్‌గా సైలెంట్ అయ్యారు.. గతంలో ఎంతో ఎగ్రెస్సివ్‌గా దూసుకువెళ్లిన శ్యామల ఆవేశం ఇటీవల కాస్త చల్లబడింది.. పార్టీలో కొందరు నేతలు ఆడుతోన్న గేమ్‌కి ఆమె బలయిందనే చర్చ సాగుతోంది.. ముఖ్యంగా, ఇతర మహిళా నేతలు, మాజీ మంత్రులు రోజా, విడదల రజిని ఆడుతోన్న ఇంటర్నల్ పాలిటిక్స్‌లో శ్యామల సీటు చిరుగుతోందనే ప్రచారం జరుగుతోంది..
వైసీపీ ఓటమి తర్వాత శ్యామల దూకుడు పెంచారు.. ఆమెకి పార్టీ అధికార ప్రతినిధిగా కూడా నియమించాడు జగన్. పేరుకే ఆమె పార్టీ స్పోక్స్ పర్సన్ అయినా, ఆమెని ఆ పదవిలో నియమించి సుమారు ఏడాది అవుతున్నా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుండి ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేకపోయారట.. తాడేపల్లి ప్యాలెస్ ఆఫీస్ నుండి ప్రెస్ మీట్ పెట్టాలని ఆమె ప్రయత్నిస్తోన్నా… తెలియని శక్తులు ఆమెకి స్పీడ్ బ్రేక్ వేస్తున్నాయని సమాచారం.. పార్టీలోని కొందరు నేతలు శ్యామలని అడ్డుకుంటున్నారని చర్చ సాగుతోంది.. దీంతో, ఈ గేమ్స్‌కి చెక్ పెట్టాలని భావించిన శ్యామల, తాజాగా ట్విట్టర్‌లో మోత మోగించింది.. ఇది నా కౌంట్ డౌన్ కాదు, నా స్వరానికి.. నా పోరాటానికి… ఇంకా బలంగా మొదలయ్యే స్టార్ట్ అని ట్వీట్ చేసింది శ్యామల..
శ్యామలని అడ్డుకోవడానికి తెరవెనక మాజీ మంత్రులు రోజా, విడదల రజిని ఒక్కటయ్యారని ఆమె భావిస్తోందట.. ఆ ఇద్దరి కుట్రల వలనే తను బ*లిపశువుగా మారుతున్నానని తెలుసుకున్న శ్యామల, ఇకపై వారిపై తిరుగుబాటు జెండా ఎగరవేయాలని నిర్ణయించుకుందట.. శ్యామల గ్రాఫ్ పెరిగితే, అది తమకు డ్యామేజ్ అని లెక్కలు వేసుకున్న రోజా, రజిని ఈ స్కెచ్‌వేశారని సమాచారం..మరి, రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి..











