టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ అవకాశాలు తక్కువైయ్యే సరికి బాలీవుడ్ కెరీర్‌పై దృష్టిపెట్టారు. హిందీలో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే చేతికి వస్తున్న తెలుగు సినిమా అవకాశాలను వదులుకోవడం లేదు. ఇప్పటికే నితిన్ సినిమాలో నటిస్తోన్న రకుల్ తాజాగా వైష్ణవ్ తేజ్ సరజన కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఈ సినిమా క్రిష్ జాగార్లమూడి దర్శకత్వంలో రెడీ అవుతుంది.
క్రిష్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు రకుల్ అయితేనే బాగుంటారని భావించి ఆమెకు స్టోరీలైన్ కూడా చెప్పారట. క్రిష్ చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్న రకుల్ ఓ అప్ కమింగ్ హీరోతో కలిసి నటించడానికి అసలు కారణం ఈ సినిమాలో అమె పోషించబోయే పాత్రే అంటున్నారు సినీ జనాలు. రకుల్ తొలిసారిగా తన కెరీర్ లో ఓ వేశ్యగా నటిస్తుందట. అంతేకాదు ఈ సినిమాలో రకుల్ ప్రీత్ డీ-గ్లామర్ రోల్ చేయనున్నారని టాక్.
రకుల్ రోజువారీ కూలీగా, అలానే వేశ్యగా రకుల్ రెండు షేడ్స్ లో కాస్త మొరటుగా కనిపిస్తుంది అంటున్నారు. థ్రిల్లర్ జానర్ లో రెడీ అవ్వనున్న ఈ సినిమాకు రకుల్ పోషించే పాత్ర చాలా కీలకం అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటివరకు మేకప్ తో రకుల్ ని చూసిన ఆడియోన్స్ మరి ఈ బ్యూటీని డీ గ్లామర్ రోల్ లో ఏ రేంజ్ లో యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ మూవీకి ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉండటంతో సాధ్య మైనంత త్వరగా ఈ చిత్రాన్ని రెడీ చేయడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట, రకుల్ ఆల్రేడీ ఈ సినిమా కోసం 45 రోజులు కంటిన్యూగా డేట్స్ కేటాయించిందని సమాచారం.











