సరిలేరు నీకెవ్వరూ తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి రేంజ్ బాగా పెరిగిపోయింది. అయితే అనిల్ రేంజ్ తన మొదటి సినిమా పటాస్ తరువాత నుంచే బాగా పెరుగుతూ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఫ్లాప్ అనేది లేకుండా అనిల్ తన కెరీర్ ని నడిపించేశాడు. అయితే అనిల్ మీద ఎప్పుడూ రానంత నెగిటివిటీ కూడా సరేలేరు నీకెవ్వరూ తరువాత పెరిగిందనే చెప్పాలి.
నిజానికి సరిలేరు నీకెవ్వరూ సినిమా సంక్రాంతి రేస్ లో ఓడిపోయింది. అంటే మెజారిటీ జనాలు ఈ సినిమా కంటే అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో చిత్రానికే ఓటు వేశారు. అయితే సరిలేరు నీకెవ్వరూ కూడా 100 కోట్లు వరకూ కలెక్ట్ చేయడంతో అటు మహేశ్ బాబు, ఇటు అనిల్ రావిపూడి తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వేసుకున్నారు. అయితే సరిలేరు తరువాత తన సక్సెస్ ఫార్మూలాని పక్కనపెట్టి కాస్త కొత్త రూటులో వెళ్లడానికి అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకున్నాడట, ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయడానికి సన్నాహాలు కూడా చేశాడు.
కానీ ఇన్ని హిట్లు వచ్చినా దర్శకుడు చెప్పినా సరే ఏ పెద్ద బ్యానర్ వారు కూడా అనిల్ రాసిన లేడీ ఓరియెంటెడ్ కథను సినిమాగా తియ్యడానికి ఒప్పుకోవడం లేదని సమాచారం. దీంతో మళ్లీ తన పాత పద్ధతిలోనే ఓ ఇంట్రెస్టింగ్ కామెడీ స్టోరీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ఇద్దరు యంగ్ హీరోలతో ఈ సినిమా తియ్యాలన్నది అనిల్ ప్లాన్ అన్నట్లుగా తెలిసింది. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ లతో ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి అనిల్ ట్రై చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.











