కొత్తగూడెంలో రాఘవ దౌర్జన్యాలకు అడ్డూఅదుపూలేదు..!
రెండు తెలుగురాష్ట్రల్లో సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్యకు కారకుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ! రాఘవ దౌర్జన్యాలు, కీచక పర్వాలు తవ్వెందుకు ఒక్కొక్కటిగా బహిర్గతమౌతున్నాయి. 1991 లో అప్పటి స్పాంజ్ ఐరన్, నేటి ఎన్ఎండీసీ కర్మాగారంలో యూనియన్ ఎన్నికల్లో చిర్ల చిట్టయ్య అనే కార్మికుడిని అపహరించి, హత్య చేసి గోదావది నదిలో పడేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు. ఆనాటి నుంచి అతని ఆరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. తర్వాత 1993 లో ఎన్ఎండీసీ సమీపంలో ఓ వ్యక్తికి శిరోముండనం చేయించాడన్న ఆరోపణణలు ఉన్నాయి. అదే ఏడాది ఓ అత్యాచార యత్నం కేసులోనూ ఇరుక్కున్నాడు. వాటన్నింటినీ తన రాజకీయ బలంతో వెలుగులోకి రాకుండా తొక్కిపట్టారని ఆరోపణలు లేకపోలేదు. మూడుపులు లేనిదే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యలేమని రియాల్టర్లు వాపోతున్నారు. ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టినా తన, పర భేదం లేకుండా ముడుపులు చెల్లించాల్సిందేనని హుకూం జారీ చేస్తాడని సొంతపార్టీనేతలే బహిరంగంగా ఆరోపిస్తుంటారు. అధికారులు, మహిళా ఉద్యోగుల పట్ట అసభ్యంగా ప్రవర్తించేవాడన్న ఆరోపణలు కోకొల్లలు.
కీచకపర్వం, సెటిల్మెంట్స్ లో తనకు తానే సాటి..!
1996లో పాల్వంచ లో పనిచేసిన ఓ పోలీసు భార్యపై అత్యాచారం చేయగా.. అతను ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 2013 లో ఓటర్లును భయబ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ అప్పటి ఏఎస్పీ భాస్కర్ భూషణ్ రాఘవను అరెస్టు చేసి పలు సెక్షన్ల కిందా కేసు నమోదు చేశారు. 2019 లో గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో పేరుకు తండ్రి వనమా వెంకటేశ్వరావు ఎమ్మెల్యే అయినప్పటికీ పెత్తనం మొత్తం రాఘవదే! గత ఏడాది క్రితం నవభారత్ ఏరియా భూ అక్రమణ క్రమంలో ఓ గిరిజన మహిళపై దాడికి పాల్పడిన సంఘటనలో రాఘవపై కేసు నమెదైంది. 2021 జులై 30న ఫైనాన్సియర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడానికి రాఘవ బెదిరింపులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు వనమా రాఘవ! దీంతో వనమాను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది!! సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్ చార్జ్ నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని అధిష్టానం ఆదేశాలు జారీచేసింది.











