సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారినపడ్డారు. నిన్న రాత్రి మహేష్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. స్వల్ప లక్షణాలు ఉండడం వలన కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయినట్టుగా మహేష్ బాబు తెలియచేశారు. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ అయినట్టుగా పేర్కొన్నారు. తనతో కాంటాక్ట్ అయిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని.. అలాగే ఎవరైనా టీకా వేయించుకోకపోతే వెంటనే వెళ్లి టీకా వేయించుకోవాలి అన్నారు మహేష్ బాబు.
టీకా వలన ఆరోగ్య పరిస్థితి విషమించకుండా ఉంటుందని.. హాస్పటల్ చికిత్స అవసరం ఉండదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. తనకు కరోనా సోకిందని సోషల్ మీడియాలో మహేష్ బాబు ప్రకటంచినప్పటి నుంచి సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు ఆయన వెంటనే కోలుకోవాలని.. కరోనా నుంచి బయటపడాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో మహేష్ గురించి స్పందిస్తూ… మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మహేష్ మళ్లీ.. నిన్ను యాక్షన్ మోడ్ లో చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చిరంజీవి మహేష్ బాబుకి ఉత్సాహభరితంగా రికవరీ విషెష్ ని తెలియజేసారు. మహేష్ గురించి చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.











