చైనా యాప్ లకు అమెరికా కూడా భరతవాక్యం పలుకుతోంది. ఈ ఆదివారంతో టిక్ టాక్, వీచాట్ అక్కడ నిషేధానికి గురవుతున్నాయి.
వీచాట్ అనేdr చైనా బేస్డ్ యాప్. అందులో ఫేస్ బుక్, వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ లాంటి ఇంకెన్నెన్నో ఫీచర్స్ ఉన్నాయి. వీచాట్ యాప్ ని అమెరికాలో రోజుకి సగటున కనీసం 1.9 కోట్ల మంది ఉపయోగిస్తూ ఉంటారు. అందులో చైనా నుంచి చదువులకోసం వచ్చిన విద్యార్థులు, చైనా తో వ్యాపారం చేసే కంపెనీ మెంబర్లు ఇలా చైనాతో ముడి పడి ఉన్న వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇదే వీచాట్ చైనాలో మోస్ట్ యూజ్డ్ సోషల్ మీడియా యాప్. వీచాట్ తమకు ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ యూజర్స్ ఉన్నారని చెప్పుకుంటుంది.
అమెరికా ప్రజల పర్సనల్ డేటాకు చైనీస్ యాప్స్ నుంచి సెక్యూరిటీ థ్రెట్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టిక్ టాక్ క్రియేటర్స్ బైట్ డాన్స్ ఒరాకిల్ కార్పోరేషన్ తో కలిసి టిక్ టాక్ గ్లోబల్ అనే ఓ కొత్త కంపెనీ చేయాలనే ఆలోచనల్లో ఉంది. ఆ టిక్ టాక్ గ్లోబల్ యాప్ తీసుకురావడం ద్వారా యూఎస్ యూజర్స్ సెక్యూరిటీ కి ప్రమాదం లేదని యూఎస్ కి ప్రూవ్ చేయాలనుకుంటోంది. బైట్ డాన్స్ వాళ్లు ఓ కొత్త యాప్ తెచ్చి దీనితో ప్రమాదం లేదని చెప్పినా బ్యాన్ ఎత్తివేయాలంటే ట్రంప్ సర్కారు అంగీకరించాల్సిందే.
ఆగస్టు 6న ట్రంప్- తన దేశ ప్రజల పర్సెనల్ డేటాకు ఏవైతే యాప్స్ ప్రమాదంగా మారాయో ఆయా యాప్స్ ని బ్యాన్ చేసేందుకు 45రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు ఈ ఆదివారం 20 సెప్టెంబర్ కు ముగుస్తుంది.
ఈ కోవిడ్ సమయాల్లో ఇండియా చైనా శత్రుత్వం పెరుగుతుండగా.. ఇండియా చాలా వరకు చైనా యాప్స్ ను బ్యాన్ చేసి చైనా నిపెద్ద దెబ్బ కొట్టింది. ఏదైతే సెక్యూరిటీ ప్రమాదం అని ఇండియా నిషేధించిందో.. అవే యాప్స్ ని అమెరికా కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన ఈ యాప్స్ లో టిక్ టాక్ మరియు పబ్జి యాప్స్ దేశవ్యాప్తంగా అతి ఎక్కువ వాడుతున్న యాప్స్.
అది కేవలం మన దేశంలోనే కాదు. ఈ యాప్స్ ప్రతీ చోట మోస్ట్ యూస్డ్ యాప్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఇండియా లాంటి పెద్ద దేశం తర్వాత అమెరికా కూడా చైనా యాప్ప్ మీద నిందలు మోపుతుంది. మరి అమెరికా చేసిన ఈ బ్యాన్ ఈ రెండు యాప్స్ తో అగుతుందా లేదా మొత్తంగా అన్నీ యాప్స్ ను బ్యాన్ చేసి చైనా కి ఇంకో పెద్ద దెబ్బ వేస్తుందా.. చూడాలి.