ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి సలహాదారు అజయ్ కల్లాంరెడ్డి కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీరమణ, హైకోర్టు న్యాయమూర్తులపై…సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను అజయ్ కల్లాంరెడ్డి మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ తయారు చేసింది కూడా అజయ్ కల్లాంరెడ్డేనని తెలుస్తోంది. లేఖ విడుదల సమయంలో నేను చెప్పేది మాత్రమే రాసుకోండి ప్రశ్నలు వేయవద్దని మీడియాకు ముందుగా షరతులు పెట్టారు. న్యాయవ్యవస్థ తీర్పులపై ముఖ్యమంత్రి లేఖను అజయ్ కల్లాంరెడ్డి విడుదల చేశారు. ఆ లేఖ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో, ఇప్పటికీ ఎంత వివాదంగా ముదురుతున్నదో అందరికీ తెలిసిందే..
అప్పటి నుంచి కనిపించకుండా పోయిన అజయ్ కల్లాంరెడ్డి
న్యాయవ్యవస్థ పనితీరును తప్పుపడుతూ ఏపీ సీఎం పేరుతో లేఖను విడుదల చేసిన ముఖ్యమంత్రి సలహాదారు కనిపించకుండాపోయారని సచివాలయవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఒక కోర్టులో తీర్పు నచ్చకపోతో పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా, కోర్టు తీర్పులను తప్పుపట్టి అజయ్ కల్లాంరెడ్డి పెద్ద తప్పే చేశారని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నరు. ఆయన అరెస్టు తప్పదనే వార్తలు గుప్పుమనడంతో అజయ్ కల్లారెడ్డి ఎక్కడా కనిపించడం లేదట.
కీలకపదవులు అప్పగించిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అజయ్ కల్లాంరెడ్డికి కీలక పదవులు అప్పగించారు. నెల రోజులే సర్వీసు ఉందని తెలిసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. ప్రభుత్వం మారగానే అజయ్ కల్లాంరెడ్డి చంద్రబాబుపైనే ఆయుధాలు ఎక్కుపెట్టారు. అమరావతిలో 6 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని పెద్ద పుస్తకాలే రాసి, విడుదల చేశారు. ఆ తరవాత వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకున్నారు.
గతంలో చంద్రబాబును తిట్టి పదవులు దక్కించుకున్నారు. నేడు ఆ పదవులు నిలుపుకునేందుకు ఏకంగా న్యాయమూర్తుల తీర్పులపైనే విమర్శలు చేస్తున్నారు అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులపై ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి అజయ్ కల్లాంరెడ్డి పెద్ద తప్పే చేశారని న్యాయనిపుణులు పెదవి విరుస్తున్నారు.
మూల్యం చెల్లించకతప్పదా?
అజయ్ కల్లాంరెడ్డి చేసిన తప్పునకు మూల్యం చెల్లించక తప్పేలా లేదు. హైకోర్టు తీర్పులపై ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, వారు దాన్ని సీరియస్గా తీసుకోవడం దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఏపీ సీఎం పేరుతోనే న్యాయవ్యవస్థపైనే నిందలు వేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖను బహిరంగంగా విడుదల చేసిన అజయ్ కల్లాంరెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. నెల రోజుల్లోనే దీనిపై సుప్రీంకోర్టు స్పందించే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి పదవికి గండం కూడా పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఏది ఏమైనా పదవిని కాపాడుకోవడానికి అజయ్ కల్లాంరెడ్డి పెద్ద దుస్సాహసమే చేశారని భావించకతప్పదు.











