అల్లు అర్జున్ తన ఫ్యామిలీ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడన్న సంగతి తెలిసిందే. వీలున్నప్పుడల్లా .. పిల్లలతో చిన్న పిల్లాడిలా కలిసిపోయి.. అల్లరి చేయడం అతడి నిత్య కృత్యాల్లో ఒకటి. ముఖ్యంగా బన్నీ కూతురు చిన్నారి అర్హ కి తండ్రి అంటే ప్రాణం. అలాగే… కొడుకు అయాన్ కూడా తండ్రి తో అల్లరి చేయడంలోనూ, ఆడుకోవడంలోనూ ముందుంటాడు. అలాంటి పిల్లల్ని వదిలిపెట్టి బన్నీ.. 15 రోజులు గా దూరంగా ఉంటున్నాడు.
అల్లు అర్జున్ కి ఆ మధ్య కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హోం క్వారంటైన్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ వచ్చాడు. అప్పటి నుంచి తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. రీసెంట్ గా టెస్ట్ చేయించుకోగా.. నెగెటివ్ వచ్చింది. దాంతో బన్ని తిరిగి తన ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే.. ముందుగా తన పిల్లల్ని ఆనందంగా కౌగిలించుకొని ముద్దాడి.. బాగా ఎమోషనల్ అయ్యాడు. పిల్లలిద్దరూ తండ్రిని చూసిన ఆనందానికి ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
ఈ రోజు బన్నీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నీ లాగానే.. ఎంతో మంది తండ్రులు తమ కుటుంబానికి దూరంగా ఉండి.. కరోనా తగ్గాకా.. ఇలానే భావోద్వేగానికి లోనవడం జరుగుతోంది. బన్నీ అభిమానులు ఈ వీడియో ను చూసి తామూ ఎమోషనల్ అవుతున్నారు.











