కొవిడ్ సెండక్ వేవ్ భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ మరో ఫంగస్ భయపెడుతోంది.గతంలో అహ్మదాబాద్, ధిల్లీలో బయటపడిన బ్లాక్ ఫంగస్ కొందరు కొవిడ్ బాధితుల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు సూచిస్తుండడమే ఇందుకు కారణం.ఈ మేరకు బీబీసీ కూడా ప్రత్యేక కథనాన్న వెలువరించింది.కొన్నాళ్ల క్రితం ICMR కూడా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఈ ఫంగస్ బయటపడడంతో కొన్ని ఆందోళనలు నెలకొన్నాయి.
బ్లాక్ ఫంగస్ అంటే..
బ్లాక్ ఫంగస్‌ను ‘మ్యూకోర్‌మైకోసిస్’గా పిలుస్తారు.గతంలోనూ పలుచోట్ల ఈ వైరస్ బయటపడింది.అయితే కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా ఇవి బయటపడుతుండడంతో మళ్లీ చర్చ మొదలైంది.భూ వాతావరణంలో ఉండే ‘మ్యూకోర్’ అనే ఫంగస్ మనుషులకు సోకితే అది మ్యూకోర్ మైకోసిస్‌గా పిలుస్తారు.ఆరోగ్య సమస్యలు తలెత్తినవారు,స్టెరాయిడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకునే వారికి సోకిత ప్రమాదకరంగా మారుతుందనే అంచనాలున్నాయి.ఈ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను టార్గెట్ చేస్తుంది.కొన్నిసార్లు సైనస్‌కి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

గుర్తించడం ఇలా..
కొవిడ్-19 లక్షణాలే ఈ ఫంగస్ సోకిన వారికీ కనిపిస్తాయి.ఒళ్లు నొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం,వాంతులైతే రక్తపు జీరలు పడటం,ఉన్నట్లుండి మర్చిపోవడం,బీపీ, షుగర్స్ లెవెల్ మార్పులు బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.దీర్ఘకాలిక యాంటిబయాటిక్స్ ఇంజెక్షన్స్ వల్ల బయటపడొచ్చు. ఆరునుంచి 8వారాల పాటు ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి ఉంటుంది.ఒక్కో ఇంజెక్షన్ రూ.6వేల నుంచి రూ.9వేల వరకు ఆసుపత్రులు వసూలు చేస్తున్నట్లు కథనాలూ వస్తున్నాయి. కాగా గత 15 రోజుల్లో సూరత్లో 40 మందికి ఈ వ్యాధి సోకినట్టు వార్తలు వచ్చాయి. మహారాష్ట్రలో 200 కేసులు బయటపడ్డాయి.కొవిడ్, బ్లాక్ ఫంగస్ రెండూ అటాక్ అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుందనే హెచ్చరికాలూ ఉన్నాయి.ఈ వ్యాధి క్రమంగా దృష్టి లోపానికి దారి తీస్తుందని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టరేట్ (డిఎంఈఆర్) చీఫ్ డాక్టర్ తాత్యారావు లాహనే కూడా హెచ్చరించారు.కాగా అమెరికా CDC (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అంచనా ప్రకారం అవయవ మార్పిడి జరిగిన వారు, స్టెరాయిడ్లు వాడుతున్న వారితోపాటు మధుమేహుల్లో ఎక్కువ కనిపిస్తుంది.కోవిడ్ నియంత్రణ కోసం చాలా ప్రభావం చూపే మందులు వినియోగించడం, స్టెరాయిడ్స్ వినియోగించడంతో పాటు కొవిడ్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉందని గతంలో అమెరికాకు చెందిన వైద్యులూ ప్రకటించారు.ఫంగస్ వల్ల జరిగిన, జరుగుతున్న నష్టం తెలుసుకునేందుకు ఎమ్మారై స్కాన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది.సకాలంలో గుర్తించని పక్షంలో ప్రాణ నష్టం కలిగిస్తుందని, ఆదిలోనే గుర్తించకుంటే కంటిచూపుపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఒకరి నుంచి మరొకరికి సోకదు..
అయితే ప్రస్తుతానికి బ్లాక్ ఫంగస్‌లో మౌలిక లక్షణాల మేరకు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు.యాఫోటెరిసన్ ‘బీ’ లాంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.అయితే చికిత్స కొంత ఖర్చుతో కూడుకుని ఉంటుందని చెబుతున్నారు.ముంబయిలో సియాన్ ఆస్పత్రిలో గత రెండు నెలల్లో 24 కేసులు బయటపడడంతో ఆ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. గతం కంటే ఇప్పుడు తమ ఆసుపత్రికి ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఈఎన్‌టీ చీఫ్ డా. రేణుకా బ్రాడూ మీడియాకు చెప్పారు.బెంగళూరులోని తమ ఆసుపత్రికి గతంలో చాలా తక్కువ కేసులు వచ్చేవని, అయితే ఈ ఏడాది కాలంలో దాదాపు పదివేలకు పైగా కేసులు వచ్చినట్టు బెంగళూరులోని డాక్టర్ రఘురాజ్ హెగ్డే ఆసుపత్రి ప్రకటించింది.











