కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన కథానాయిక మెహ్రీన్. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని సరసన నటింంచింది. తొలి సినిమాలో పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించిందనే మంచి పేరు తెచ్చుకుంది. అలాగే కమర్షియల్ సక్సస్ సాధించింది. ఆతర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, ఎఫ్ 2 చిత్రాల్లో నటించింది. అయితే.. కెరీర్ స్పీడు అందుకుంటుంది అనుకున్న టైమ్ లో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి షాక్ ఇచ్చింది. అదేంటి..ఇప్పుడే కదా కెరీర్ స్టార్ట్ చేసింది అప్పుడే పెళ్లి అంటి అనుకున్నారు సినీ జనాలు.
హర్యాన మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ కు వివాహం కుదిరింది. ఈ సంవత్సర మార్చి నెలలో వీరిద్దరికి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఈపాటికే మ్యారేజ్ జరగాల్సింది అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మ్యారేజ్ వాయిదా పడింది. మ్యారేజ్ పోస్ట్ పోన్ కావడం వలన వచ్చిన సినిమా అవకాశాలకు ఓకే చెప్పింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఏక్ మినీ కథ ఫేమ్ సంతోష్ శోభన్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమాతో పాటు ఎప్ 2 సీక్వెల్ ఎప్ 3లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే.. ఏమైందో ఏమో కానీ తాను, బిష్ణోయ్ విడిపోతున్నట్లు మెహ్రీన్ ట్విట్టర్ లో ప్రకటించి షాక్ ఇచ్చింది. బిష్ణోయ్ తో జరిగిన నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు తెలియచేసింది. తామిద్దరం పెళ్లి చేసుకోవడం లేదని కూడా తేల్చేసింది. ఈ నిర్ణయం ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నట్లు మెహ్రీన్ ప్రకటించింది. ఇక పై బిష్ణోయ్ తో కానీ, అతడి కుటంబ సభ్యులు, స్నేహితులతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండదని మెహ్రీర్ ప్రకటించడం సంచలనంగా మారింది. నా మనసుకు నచ్చినట్లుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెహ్రీన్ తెలియచేసింది. తన నిర్ణయాన్ని, వ్యక్తిగత విషయాలని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇక నుంచి తాను ఇంతకు ముందు వలే సినిమాల్లో నటిస్తూ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మెహ్రీన్ తెలియచేసింది. మరి.. ఇప్పుడు కెరీర్ లో మరింతగా స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తుందేమో చూడాలి.
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021











