ఏపీలో తాజాగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్ధ చేపట్టిన సర్వేలో ప్రజలు అనూహ్యంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్ధ ఇచ్చిన నివేదిక చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనాలు మొదలయ్యాయి.
చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంప్ధ ఏపీ ప్రజల మూడ్ ఎలా ఉంది అని సర్వే ప్రారంభించగా.. ప్రజలు ఈ సారి బలంగా నాయకత్వం మార్పు.., ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని తేలింది. ఏపీలో ఆల్ మోస్ట్ అన్నీ వర్గాల వారు.., అర్బన్, రూరల్ ఏరియాల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని సర్వే నివేదికను ఇచ్చింది. అన్నీ నియోజకవర్గాల్లో క్షేత్ర స్ధాయిలో పరిశీలించి.., వివిధ రూపాల్లో ప్రజల మనోగతాన్ని తెలుసుకున్న తరువాతే సర్వే రిపోర్టును అందజేస్తున్నట్లు సంస్ధ నిర్వాహాకులు ముఖేష్ వెల్లడించారు. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమికి దాదాపు 115 నుంచి 128 సీట్లు వస్తాయని ప్రజలు బల్లగుద్ది చెప్తున్నట్లు వెల్లడించింది చాణక్య సర్వే. అలానే జగన్ పార్టీకి 42 నుంచి 55 స్థానాలు రానున్నట్లు పేర్కొంది. ఇతరులకు 4 నుంచి 7 స్థానాలు వస్తాయని వివరించింది.
టీడీపీ సీట్లే కాదు.. గ్రాఫ్ కూడా అమాంతం పెరిగిందని చెప్పుకొచ్చింది చాణక్య. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, పెరిగిన ధరలు, ఉచిత పథకాలు అమలు వంటి అనేక కార్యక్రమాలతో వైసీపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందని కూడా చెప్పింది. అలానే రాయలసీమలో 52 స్థానాల్లో టీడీపీ , జనసేన కూటమికి 26 అసెంబ్లీ స్ధానాలు కౌవసం చేసుకుంటుందని, వైసీపీకి 19, మరో 7 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఉంటుందని చెప్పారు. మరోవైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని 45 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కూటమికి 32 అసెంబ్లీ స్ధానాలు కౌవసం చేసుకుంటుందని, వైసీపీకి 8, 5 స్ధానాల్లో టైట్ ఫైట్ తప్పదని చెప్పుకొచ్చారు. అలానే ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ, జనసేన కూటమికి 51 అసెంబ్లీ స్థానాలు కౌవసం చేసుకుంటుందని, వైసీపీ 12, 5 స్థానాలో హోరాహోరీ తప్పదన్నారు.
ఇలా మొత్తంగా ఏపీలో టీడీపీ, జనసేన కూటమికే ప్రజలు మొగ్గుచూపుతున్నారని చాణక్య చెప్పేసింది. రాష్ట్రంలో జీరో అభివృద్ధి, ఆదాయ మార్గాలు గణనీయంగా పడిపోవడం, ధరలు పెరుగుదల వంటిని ప్రధాన కారణాలుగా ప్రజలు చెప్తున్నారని వివరించారు. జగన్ ఎన్నికల హామీలు.., అమలు చేస్తున్న తీరు.., ఉద్యోగుల సమస్యలు.., పాలన విధానాల్లో తీసుకొస్తున్న మార్పులు వంటివి జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చెప్పారు. ఇదివరకు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ముందే చెప్పిన సర్వే సంస్థ చాణిక్య స్ట్రాటజీస్. ఎంతో ఖచ్చితత్వంతో కూడిన పొలిటికల్ సర్వేతో పాటు.. ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా రాజకీయ పార్టీలకు తెలియచెప్పే సంస్థగా పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి. అందుకే చాణక్య ఇచ్చిన సర్వే రిపోర్ట్ చూసి.. తాడేపల్లి ప్యాలెస్ గ్యాంగ్ లో వణుకు మొదలైంది. మరోవైపు సైకో పాలనకు త్వరలో తెరపడబోతోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.