ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని ఎవరిని అడిగినా చెబుతారు.. అడ్మినిస్ట్రేషన్‌లో ఎలాంటి నిర్ణయాలు అయినా డేర్‌గా తీసుకోవడంలో ఆయనని మించిన వారు లేరు. ఐటీకి ఊహించని భవిష్యత్తు ఉందని హైదరాబాద్‌కి ఎమ్ఎన్సీల కంపెనీలను ఆహ్వానించడమైనా, విద్యుత్, విద్యా సంస్కరణలు అయినా ఆయనకు ఆయనే కేరాఫ్ అడ్రస్.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి తన కేబినెట్లోని సహచరులకి ర్యాంకింగ్స్ ఇచ్చుకున్నారు.. కేబినెట్లోని ఇతర మంత్రుల పనితీరుపై ఎలాంటి ర్యాంకింగ్స్ ఇచ్చారో, తనకు కూడా ఆ జాబితాలో చోటు కల్పించుకున్నారు చంద్రబాబు.. ఈ ర్యాంకింగ్స్ చూసి వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు.
చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ర్యాంకింగ్స్‌ని, గత అయిదేళ్ల జగన్ పాలనతో బేరీజు వేసుకుంటున్నారు ప్రజలు.. జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రికి ఏ శాఖలో ఉందో ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు.. పేరుకి అయిదుగురు డిప్యూటీ సీఎంలని ప్రకటించాడు జగన్.. కానీ, వాస్తవంలో సర్వ శాఖలు, సకల మంత్రిత్వ నిర్ణయాలు ఆయన ఒక్కరే తీసుకునేవారు.. వాటిని మీడియా ముందు ఓ పెద్దాయని వైట్ షర్ట్‌లో వచ్చి రివ్యూ ఇచ్చేసి వెళ్లిపోయారు.. ఆయన ఎవరో కాదు.. సకల శాఖా మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ దక్కించుకున్న సజ్జల రామకృష్ణా రెడ్డి..
తాజాగా చంద్రబాబు నాయుడు సర్కార్ రిలీజ్ చేసిన కేబినెట్ మంత్రుల పనితీరులో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.. ఆ తర్వాత స్థానాలో కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ తర్వాతి స్థానాలలో నిలిచారు.. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరవ ప్లేస్ దక్కించుకోగా, కేబినెట్లో కీలక మంత్రులయిన నారా లోకేష్‌కి 8వ ర్యాంక్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 స్థానాలలో నిలిచారు.. ఇక, చివరి మూడు ర్యాంకులలో కొలుసు పార్ధసారధి, పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్ ఉన్నారు..
జగన్ హయాంలో ఇలాంటి ర్యాంకింగ్ లిస్ట్ ఒక్కటీ కనిపించలేదు.. రెండు కేబినెట్లు కొలువుదీరాయి.. ఏ ఒక్క కేబినెట్లోనూ జగన్ తన సహచర మంత్రుల వర్కింగ్‌పై ఎలాంటి అప్ డేట్ ఉండదు. ఏ శాఖకి ఏ మంత్రి ఉన్నాడో, ఆయన పనితీరు ఎలా ఉంటుందో, ఆ శాఖపై సమీక్షలపై కనీస సమాచారం ఉండదు.. తాజాగా చంద్రబాబు తన కేబినెట్‌కి ర్యాంకులు ఇవ్వడంతో, నాటి జగన్ నిరంకుశత్వానికి, నేటి చంద్రబాబు ప్రజాస్వామ్యానికి ఎంత తేడా ఉందో క్లియర్ కట్‌గా అర్ధం అయిందని, ఇది వైసీపీ అధినేత ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిందని తలలు బాదుకుంటున్నారు.. ఈ ర్యాంకింగ్… ప్రజలకు క్లియర్‌గా అర్ధం అవుతుందని, తమ పార్టీపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు వైసీపీ నేతలు..