సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు రాజకీయాలు తెలవవని, రాజకీయ నేతలతో అసలే పరిచయాలు లేవని, ఉన్నా అవి వ్యక్తిగతమే కానీ, రాజకీయ పరమైనవి కావని ట్వీట్ కహానీలు చెబుతుంటారు.. బల్లగుద్ది మరీ ఆయన అబద్దాలు అలవోకగా దొర్లిస్తుంటారు… తాజాగా ఆయనకి వైసీపీతో ఎలాంటి లింకులు ఉన్నాయో, ఆ పార్టీతో ఆయన అనుబంధం ఎలాంటిదో వెలుగులోకి వచ్చింది..
సోషల్ మీడియాలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నేత, మంత్రి లోకేష్‌తోపాటు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసి అడ్డమైన చెత్త రాతలు మొత్తం రాశాడు.. అధికారం మారడంతో కొన్నింటిని డిలీట్ చేశాడు.. ఈ కేసుపై విచారణ కోసం వర్మని ఒంగోలు పోలీసులు హాజరు కావాలని కోరారు.. ఇప్పటికే, రెండు సార్లు వాయిదా వేసిన వర్మ.. తాజాగా పోలీస్ స్టేషన్‌కి వచ్చారు.. ఆయన ఇలా వచ్చి, కారు దిగారో లేదో ఆయనను వైసీపీ నేతలు చుట్టుముట్టారు.. పోలీస్ స్టేషన్ బయట ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు..
విచారణలో వైసీపీ అధినేత జగన్‌తో బంధం గురించి, ఆయనతో ప్రత్యేక మీటింగ్, జగన్‌ని ఎలివేట్ చేస్తూ తీసిన సినిమాలు, వాటికి ఫండింగ్ అంశంతోపాటు, టీడీపీ, జనసేన అధినేతలపై చేసిన కామెంట్స్‌పై ఎలా నడుచుకోవాలో, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలో తర్ఫీదు ఇవ్వడానికి వైసీపీ నేతలు అక్కడికి చేరినట్లున్నారు.. ఇటు, పోలీసుల సిద్ధం చేసిన ప్రశ్నలకు సంబంధించి సైతం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.. దీంతో, ఇప్పటివరకు గుట్టుగా సాగుతోన్న వైసీపీ – వర్మ బంధం, అనుబంధం అంతా వెలుగులోకి వచ్చినట్లయింది.. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి..
నిన్నమొన్నటివరకు వర్మ అనేక అంశాలపై బుకాయింపు పర్వం నడిపేవాడు.. పాలిటిక్స్ తన పరిధిలో అంశం కాదంటాడు.. ఆయన రాజకీయాలపై సినిమాలు తీస్తారు.. రాజకీయ నేతల గురించి తాను పట్టించుకోను అంటాడు.. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ని నెగిటివ్‌గా చూపిస్తూ సినిమాలు తీస్తాడు.. వారిపై కామెడీ సెటైర్లు, పంచ్‌లు వేస్తారు వర్మ తన సినిమాలలో… మరి, వైసీపీ నేతలతో లింకులు లేవా అని ప్రశ్నిస్తే వాటిపై నోటికి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడతాడు.. వైసీపీ నేతలని నిర్మాతలుగా మారుస్తూ వారితోనే మూవీస్ చేస్తాడు.. అయినా తప్పించుకునే యత్నం చేస్తాడు వర్మ.. తాజాగా, ఫ్యాన్ పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు బయటపడడంతో ఇక వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి…