మొన్నామధ్య విశ్వక్ సేన్ హీరోగా HIT అనే సినిమా వచ్చింది. మంచి సక్సెస్ సాధించింది. HIT అనే పదానికి అబ్రివేషన్ పరంగా హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనే విషయాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో ఆ సినిమా మేకర్స్ ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ అబ్రివేషన్ నే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ గా మార్చుకొని మన టాలీవుడ్ లోని కొంత మంది యంగ్ డైరెక్టర్స్.. సరికొత్త కథాంశాలతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది చెప్పుకోదగ్గ మార్పే. క్షణం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలు ఆ జోనర్ లో వచ్చి సక్సెస్ అయిన చిత్రాలే.
నిన్నమొన్నటి వరకూ తెలుగు ఇండస్ట్రీ అనగానే.. యాక్షన్ కు, హీరోల ఓవర్ యాక్టింగ్ కు పెట్టింది పేరుగా ఉండేది. దాని వల్ల మిగతా ఇండస్ట్రీస్ కన్నా కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. అయితే కొంతకాలంగా.. మారుతున్న కాలానికి అనుగుణంగా పలువురు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ .. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే రీసెంట్ గా ‘కనబడుటలేదు’ అనే మేన్ మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ మూవీ లాంఛ్ అయింది. యం.బాలరాజు అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఇదే బాటలో మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. నిజానికి ఈ తరహా చిత్రాలు తీయడంలో తమిళ, మలయాళ మేకర్స్ చాలా ఎక్స్ పెర్ట్స్ . ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే బాటలో నడుస్తూండడం సంతోషించదగ్గ విషయమే. మరి ‘కనబడుటలేదు’ మూవీ ఇంకెందరు దర్శకులకు స్ఫూర్తిగా మారుతుందో చూడాలి.
మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...











