August 15, 2022 7:20 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture Literature

శ్రావణ మాసం

ముక్కామల చక్రధర్

August 13, 2020 at 7:13 PM
in Literature
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 కొన్ని చినుకులు… పసుపు… పేరంటం…

అగ్రహారం మీద శ్రావణ మేఘం కమ్ముకుంది. ఎర్రటి ఎండ వెళ్లిపోయి నాలుగు చినుకులు పడగానే.. మట్టి చిత్రమైన వాసనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. వర్షం పిలుస్తున్నట్లుగా ఉంది. అగ్రహారంలో అందరి ఇళ్ల ముందు వర్షపు చినుకులు లేలేతగా పడుతున్నాయి. ఒక ఆనందపు హరివిల్లు ఏదో అందరి మనసులలో విచ్చుకుంటోంది. అగ్రహారానికి ఎండ వేడిమి తెలీదు. ఏసీలు, కూలర్లు అగ్రహారానికి పరిచయం లేదు. తల పైకెత్తి చూస్తే రెండు అంతస్థుల గిడుగు రామారావు గారి మేడ మీద నలుపు.. తెలుపుల మబ్బులు ఆవరించి ఉన్నాయి. నాలుగు చినుకులు పడగానే ఇంటి పెరట్లో ఆరేసిన తువ్వాళ్లు, లుంగీలు, చీరలు, బనీన్లు తమని లోపలికి తీసుకుని వెళ్లమని పిలుస్తున్నాయి. అగ్రహారంలో ఆడపిల్లలు తమ పరికిణీలను రెండు కాళ్ల మధ్య పెట్టుకుని పైనుంచి చిరు జల్లులు పడుతూండగా తలలు కాసింత వంచుకుని కుడి చేయిని తలపై పెట్టుకుని పెరట్లో ఆరేసిన బట్టల్ని హడావుడిగా లోపలికి తీసుకుని వెళ్తున్నారు.
ఇంకా ఎండాయో లేదో తెలీక డాబాల మీద… ఇంటి ముంగిట ఇత్తడి గిన్నెలలోను, డేగిసాల్లోనూ ఎండ బెట్టిన మాగాయి, మెంతికాయ ముక్కల్ని గబగబ లోపలికి తీసుకుని వెళ్తున్నారు.
శ్రావణ మేఘం అగ్రహారాన్ని రహస్యంగా… మెలి మెల్లిగా ఆవరించుకుంటోంది.
మేఘానికి అగ్రహారం ఆలంబనగా ఉంది…
మేఘానికి అగ్రహారం తోబుట్టువుగా ఉంది….
మేఘానికి అగ్రహారం పేరంటంలా ఉంది….
మేఘం అగ్రహారాన్ని తనలోకి తీసుకున్నట్టుగా ఉంది….
అగ్రహారామే మేఘాన్ని ఆహ్వానించినట్లుగా ఉంది….
శ్రావణ మాసం అగ్రహారం నుదిటి కుంకుమ…
శ్రావణ మాసం అగ్రహారం ఆడపడచుల కాళ్ల పారాణి..
శ్రావణ మాసం అగ్రహారానికి వాయినం…
****           ****         ****               ****
శ్రావణ మంగళవారం. అత్తవారింట్లో కొత్తగా కాలు పెట్టిన మా ఆడపడుచులు అగ్రహారానికి వచ్చారు. అగ్రహారం అంతా పేరంటాల సందడి. ఆది, సోమవారాలలోనే పేరంటపు పిలుపుల సంరంభం ప్రారంభమయ్యేది. తనతో పాటు ఇద్దరు, ముగ్గురు స్నేహితురాళ్లో, తోబుట్టువులనో తీసుకుని మా ఆడపడుచులు ఇంటింటికీ వచ్చి నుదుటిన కుంకం బొట్టు పెట్టి పేరంటానికి పిలిచే వారు. ఒకటి, రెండు చోట్ల ఇంట్లో వాళ్లు లేకపోతేనో, విధి వశాత్తు ఆ ఇంటిలో ముత్తయిదువలు లేకపోతేనో, ఆ ఇంటి సింహద్వారపు గడపకి బొట్టు పెట్టి “శ్రావణ మంగళవారం నోము…మా ఇంటికి పేరంటానికి రండి” అంటూ ఆహ్వానించే వారు.
ఇది ఒక ఉత్సవం.  ఒక వేడుక.. ఒక ఆనందం…
అగ్రహారపు ఆడపిల్లలు వెన్నెలలోనే కాదు.. శ్రావణ మాసం సాయం సంధ్య గోథూళి వేళల్లో తిరుగాడే అందమైన అక్షరాలు.
ఆషాఢ మాసపు చివరి వారం… శ్రావణ మాసం మొదటి వారంలో ఆకాశంలో చిరు జల్లులతో పాటు లేలేత ఎండ ఆగ్రహారాన్ని నారింజ రంగులోకి మార్చేసేది. అగ్రహారం పిల్లలు “ఎండా వానా కుక్కల నక్కల పెళ్లి” అంటూ పాటలు పాడుకుంటూ కాలానికి ఎదురెళ్లేవారు.
శ్రావణ మంగళవారం నోము నోచుకోవడం కొత్త పెళ్లి కూతుళ్ల సంప్రదాయం. నుదిటన కుంకుమ కలకాలం ఉండాలని, తన కుటుంబాన్ని ఆది దేవత మంగళగౌరి చల్లగా చూడాలని అగ్రహారం ఆడపడుచులు భక్తితో, శ్రద్ధతో చేసే నోము.
ఈ క్రతువుకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పూజకు ఎంతో పవిత్రత ఉంది. సోమవారం సాయంత్రానికే ఇంట్లో మగవాళ్లు మంగళగౌరి వ్రతానికి కావాల్సిన సరంజామా ఇళ్లలో చేర్చేవారు. పూలు, అరటి పళ్లు, తమలపాకులు, వక్కలు సిద్ధం చేసే వారు. వాయినంలో ప్రధానమైన  పచ్చి సెనగలు సోమవారం రాత్రే తీసుకువచ్చి నీళ్లలో నానపెట్టేవారు. ఆ నీళ్లలో కాసింత పసుపు కూడా కలుపుతారు. ఇలా చేయడం వల్ల ఆ సెనగలకు శుభప్రదం చేకూరుతుందనేది నమ్మకమైతే, మరోవైపు వర్షాకాలంలో ప్రబలే బ్యాక్టీరియా దరి చేరకుండా ఉండేందుకు ఆ పసుపు మేలు చేస్తుందనేది వైద్య శాస్త్రపు రహస్య సందేశం.
శ్రావణ మంగళవారం ఉదయమే తలారా స్నానం చేసి పట్టుచీరతో మెరిసిపోయే వారు మా ఆడపడుచులు. పిండివంటలు కూడా సిద్ధం చేసేవారు తల్లులు, పెద్ద వారు. అనంతరం మంగళగౌరి పూజ ప్రారంభమవుతుంది. తమలపాకులో పసుపు వినాయకుడు, మంగళగౌరిని తయారు చేసి వాటికి పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమతో వినాయకుడిని, మంగళగౌరిని పూజిస్తారు. ఈ పూజ ముగిసిన తర్వాత శ్రావణ మంగళవారపు అసలైన క్రతువు ప్రారంభమవుతుంది. బియ్యపు పిండి, ఆవునెయ్యితో ప్రమిదలు తయారు చేస్తారు. ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి, వొత్తులు వేసి జ్యోతులు వెలిగిస్తారు. కొత్తగా పెళ్లి అయిన ఆడపడుచు అయితే ఐదు జ్యోతులు వెలిగిస్తారు. రెండో సంవత్సరం నోము నోచుకునే వారు పది జ్యోతులు… అలా ఐదు సంవత్సరాల వరకూ జ్యోతులు పెంచుకుంటూ చివరకు 25 జ్యోతులతో ఈ నోము నోచుకుంటారు. జ్యోతులు వెలిగించిన తర్వాత కుడిచేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకుని, అట్లకాడకు ఆవు నెయ్యి రాసి, దానికి కంకణంకడతారు. ఇలాంటి కంకణాలను అమ్మవారికి, నోము చేసుకుంటున్న వారు,  బుట్ట వాయినం తీసుకునే ముత్తయిదువుకు కడతారు. కంకణం కట్టి సిద్ధం చేసిన అట్లకాడను వెలిగించిన జ్యోతులపై ఉంచి మంగళగౌరి వ్రత కథను చదువుకుంటారు. ఈ కథ పూర్తి అయ్యే వరకూ ఆ అట్లకాడ జ్యోతుల మీద కాలుతూనే ఉంటుంది. జ్యోతుల వెలుగుతో ఆ అట్టకాడ కాటుకలా నల్లగా చిమ్మ చీకటిలా మారుతుంది. ఆ కాటుకను కళ్లకు పెట్టుకుంటారు నోము నోచిన వాళ్లూ… సాయంత్రం పేరంటానికి వచ్చేవాళ్లు. ఈ కాటుక ముందు ఐశ్వర్యారాయ్  ఐటెక్స్ కాటుక దిగదుడుపు. అంత వరకూ వెలిగించిన ఆ జ్యోతుల దీపం కొండెక్కగానే వాటిని నోము నోచుకునే వారే తినాలి. అందులో కూడా ఆరోగ్య రహస్యం ఇమిడి ఉండడం విశేషం. సాయంత్రం వరకూ పేరంటం ఉండదు. ఈలోగా నోము నోచుకున్న వారు ఆకలికి ఆగలేరని ఓ ముత్తయిదువుకు ముందుగా బుట్ట వాయినం ఇస్తారు. ఇందులో ఆకులు, వక్కలు, సెనగలు, పసుపు, కుంకుమ, పళ్లు ఆమెకు ఇచ్చి ఆమెను మంగళగౌరిలా తలుస్తారు. ఆ బుట్ట వాయినాన్నే సాయంత్రం జరిగే పేరంటంలో అందరికి పంచుతారు.
శ్రావణ మంగళవారం పేరంటం అంటే నలుగురు మహిళలు కూర్చుని కుళాయి దగ్గర కబుర్లు చెప్పుకోవడం కాదు. తమ పిల్లల చదువుల గురించి, వారి పెళ్లి సంబంధాల గురించి కలబోసుకోవడం. అగ్రహారం కుటుంబాల్లో సుఖాలని, కలతలని పంచుకోవడం. తమకున్న నగ నట్రాని పది మందికీ చూపించి మురిసిపోవడం.
“ఇదీ మెడ్రాస్ లో ఉంటున్న మా పెద్దాడు వాడి తొలి జీతంతో కొన్నాడు. సెలవు పెట్టీ మరీ కంచి వెళ్లి కొన్నాడు. చంద్రకాంతం రంగు అంటే నాకిష్టమని వాడికి తెలుసు. అందుకే ఈ రంగు కొన్నాడు” అని చెప్పుకోవడం.
అంతే కాదు. “ఇదిగో అమ్మాయి. కాళ్లకు పసుపు రాసేప్పుడు కాస్త చూసుకుని రాయి. జరీ అంచుకి పసుపు అంటుకుంటే  పోదు” అని కాసింత జాగ్రత్తలు చెప్పడం.
నేల మీద చాపలు పరిచి చుట్టూ కూర్చున్న అగ్రహారం అమ్మలు, ఆడపడుచులు సరదగా వేళాకోళాలాడుకోవడం.
” మొన్నామధ్య దక్షిణామూర్తి వీధిలో కనిపించింది మీ ఆఖరిది. చక్కగా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. దానికి సంబంధాలు చూస్తున్నారా… మా అన్నయ్య కొడుకున్నాడు. మీకభ్యంతరం లేకపోతే నే మాట్లాడతా”
“అయ్యో… అభ్యంతరమా… భలే వారే. మీ అన్నయ్య గారంటే నాకూ అన్నయ్యే. ఆయనతో ఓ మాట చెబుతా” ఇలాంటి సమాధానాలు.
“ఇది మా చెల్లెలు కూతురు. హైడ్రాబ్యాడ్ లో ఉంటారు. మొన్ననే వచ్చింది. అక్కడ డిగ్రీ చదువుతోంది. అన్నట్లు సంగీతం కూడా నేర్చుకుంటోంది”
“అవునా.. ఏది పిల్లా ఓ కీర్తన అందుకో”
ఒక్క కీర్తనతో ఆ హైడ్రాబ్యాడ్ చిన్నది ఆ వారం అగ్రహారంలో ఆడవాళ్లు మెచ్చిన హీరోయిన్.
” కాలికంతా పసుపు రాయకండి. జెస్ట్ బొటనవేలికి రాయండి. దిస్ ఈజ్ గుడ్. బట్ కాలంతా అయిపోతుంది”
“భలే దానివే. వేలుకి రాసుకుంటావా. ఇంకా నయం గోరుకు రాయమనలేదు. ఇది మన సంప్రదాయం. సిటీ గోల ఇక్కడికి వచ్చేస్తోంది”  ఓ పెద్దావిడ మందలింపు.
“ఇదిగో… ఏవండీ… మీరు పట్టాభి వీధి వారే కదా… మీ అబ్బాయి ఇసాపట్నంలో వుద్యోగం అట కదా.  మావాడు చెప్పాడు. మా చెల్లెలు విజయవాడలో ఉంటోంది. మా మరిది తాశీల్దారు. బాగానే వెనకేశాడు. దాని కూతురు కుందనపుబొమ్మ. ఒక్కతే కూతురు. కొడుకు. వాళ్లూ మీ ఇంటి కొద్దావనుకుంటున్నారు. పిల్లనివ్వడానికి అడిగేందుకు ”
“అవునా… కుందనపు బొమ్మలు మాకొద్దులేమ్మా… మామూలు అమ్మాయి చాలు.  తాశీల్దారు గారు కూతురు. మా మాట ఏమి వింటుంది. అయినా… పేరంటానికి వచ్చి ఇవన్నీ ఎందుకూ…”
ఇలా ఉంటాయి అగ్రహారంలో పేరంటాలు.
ఒక ఇంట్లో పేరంటం ముగించుకుని హడావుడిగా మరో ఇంటికి… అక్కడి నుంచి మరో ఇంటికి… ఇలా అగ్రహారం అంతా శ్రావణ మంగళవారం సాయంత్రం పట్టు చీరలు, పరికిణీలు కట్టుకున్న రామచిలకలు తిరుగుతున్నట్లుగా ఉండేది. శ్రావణ మంగళవారం వచ్చిందంటే అగ్రహారంలో కుర్రాళ్లు అరుగులకు అతుక్కుపోయే వారు. అగ్రహారం మీద ఓ కన్ను వేసే వారు. ఊరికి అటు వైపున్న వేరే ప్రాంతాల కుర్రాళ్లు సైకిళ్ల మీద వచ్చి మా ఆడపడుచులను అల్లరి చేస్తారనే జాగరుకతతో. ఈ జాగ్రత్తలో భాగంగా చిన్నా చితకా గొడవలూ అయ్యేవి. ఇవి ఆ వీధి పెద్దల దగ్గరికి వెళ్తే “అయినా బామ్మల అగ్రహారానికి మీకేం పనిరా. అక్కడికెందుకు వెళ్లారు ” అనే వారు ఆ పెద్దలు.
ఇది అగ్రహారం మీద ఆ వైపు వారికి ఉన్న గౌరవం.
పేరంటం ముగిసిన తర్వాత  రాత్రి  ఏ తొమ్మిదింటికో ఇళ్లకు చేరే వారు ఆడవారు. వాళ్లు అలా రావడం ఆలస్యం పేరంటంలో ఇచ్చిన సెనగల్లో వేసిన కొబ్బరి ముక్కల్ని మాలాంటి మగ పిల్లలు ఆ వాయినంల్లోంచి ఏరుకుని  తినేవాళ్లం.
శ్రావణమాసం అంతా సెనగలతో చేసిన వంటలతో అగ్రహారం కారంగా ఉండేది. సెనగలతో చేసిన వంటల్లో పాఠోళికే అగ్ర తాంబూలం. పాఠోళీ అంటే సెనగలతో ఓ వంటకం కాదు. శ్రావణ మాసపు అద్భుతం. ఇది గోదావరి జిల్లాలకే పరిమితమైన వంటకం. ముందుగా సెనగలని నానపెట్టాలి. వాటి తొక్కలు వలిచిన తర్వాత పచ్చి మిరపకాయలు, జీలకర్ర కలిపి రుబ్బుతారు. ఈ రుబ్బడంలో కూడా అగ్రహారం మహిళలు తమ చాకచక్యం చూపించే వారు. మరీ మెత్తగా రుబ్బితే పాఠోళి పాడవుతుంది. అందుకే కాస్త బరకగా రుబ్బుతారు. అంటే విడివిడిగా అన్నమాట.  మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకుతో  పోపు సిద్ధం చేసుకుంటారు. ఆ పోపులో అంతకు ముందే సిద్ధమైన సెనగల ముద్దని కలుపుతారు. ఆ ముద్దని విడివిడిగా అయ్యే వరకూ వేయిస్తారు. ఇదే పాఠోళి అంటే. శ్రావణ మంగళవారం తర్వాత వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో అగ్రహారం వీధుల్లో తిరిగే వారికి ఈ పాఠోళి వాసన తగిలి అగ్రహారం స్వర్గానికి ముఖద్వారంలా భ్రాంతి గొలిపేది. అ పాఠోళికి ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. వారే మగాయి పచ్చడి,  వంకాయి పచ్చి పులుసు. ఆ తర్వాత స్ధానం తెల్ల వంకాయలతో చేసిన అల్లం పెట్టి సెనగలు కలిపిన ముద్ద కూర. చిరు జల్లులు పడుతూంటే వేయించిన కారపు సెనగల్ని అగ్రహారంలో మగవారు అరుగుల మీద కూర్చుని ప్రపంచ రాజకీయాలు చర్చిస్తూ తినే వారు.
***                            ***                       ***
శ్రావణ మాసం చూస్తూండగానే ఇట్టే గడిచిపోయేది. ఇంటికి వచ్చిన ఆడపడుచుల్ని తనతో తీసుకువెళ్లేందుకు అగ్రహారానికి వచ్చే వారు అల్లుళ్లు. అల్లుళ్లు వచ్చిన రోజు నుంచి పిల్ల వెళ్లిపోతుందనే దిగులు అందరినీ ఆవరిస్తోంది. ఆగ్రహారంలో రోడ్డు మీదకి వచ్చిన మగవారి ముఖాల్లో సంతోషం కనపడేది కాదు.  కుర్రాళ్లలో నెల రోజుల క్రితం నాటి హుషారూ కానరాదు. ఇక ఇళ్లల్లో తల్లుల సంగతి సరే సరి. అగ్రహారం అంతటా ఓ వర్షించడానికి సిద్ధంగా ఉన్న కన్నీటి మబ్బు తునక ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ తిరుగుతూండేది. ఓ వెలితి అందరిని వెంటాడేది.
శ్రావణ శుక్రవారం పూజలు ముగిసాయి. శనివారం నుంచే అల్లుడు, కూతురు ప్రయాణాలకు సిద్ధం అవుతున్నారు. అంత వరకూ ఖాళీగా ఓ మూల నక్కిన ట్రంకు పెట్టెలు బట్టలతో నిండు చూలాలిలా మారుతున్నాయి. గోనె సంచుల్లో కొబ్బరి కాయలు, అప్పుడే పెట్టిన ఆవకాయ, మెంతికాయ, మగాయి ఉరగాయల్ని, కడుపు చలవ కోసం చేసిన చలివిడిని తల్లులు క్యారేజీల్లో సర్దుతున్నారు.
“ఇంటికి వెళ్లగానే ఊరగాయలు జాడీల్లో సర్దేసుకో తల్లీ. ఇందులోనే ఉంచేస్తే స్టీలు క్యారేజీలు పాడవుతాయి. అన్నట్లు నీళ్లు తగిలించకమ్మా. ఏటికేడాది ఊరగాయలు బూజు పట్టేస్తాయి. ఎప్పటికప్పుడు అల్లుడిగారికి ఏం కావాలంటే ఆ ఊరగాయ తీసి వేరే ప్లేటులోనో, గిన్నెలోనో తీసుకోమ్మా” అని జాగ్రత్తలు చెబుతున్నారు.
రిక్షాలు వచ్చాయి. ఓ రిక్షాలో సామాన్లు. మరో రిక్షాలో కూతురు, అల్లుడు బస్టాండికి బయలు దేరుతున్నారు. ఒకటి రెండు రోజుల తేడాలో అగ్రహారం అంతా ఇలాగే ఉంది. రిక్షాల వెనుక లూనా మీదో, బజాజ్ ఛేతక్ మీదో తలిదండ్రులు బస్టాండ్ కి బయలు దేరారు. తమ్ముళ్లు, అన్నలు వాళ్ల సైకిళ్ల మీద బస్డాండ్ కి చేరుకుంటున్నారు.
సాయంత్రం ఐదు గంటలు. హైదరాబాద్ బస్సు సిద్ధంగా ఉంది. అలాగే మరో సమయానికి మరో బస్సు. సీన్ మాత్రం ఒక్కటే.
ముందే రిజర్వేషన్ చేయించుకున్న బస్సులో కిటికీ పక్క సీట్లో కూతురు కూర్చుంది. కింద కిటికీ పక్కన తల్లి నిలబడి జాగ్రత్తలు చెబుతోంది. బస్సుప్రధాన ద్వారానికి దగ్గరగా అల్లుడు, మామగారు మాట్లాడుకుంటున్నారు. బావమరదులు బస్సు ఎక్కి కళ్లలో నీళ్లు తుడుచుకుంటూ అక్కతో మాట్లాడుతున్నారు. అక్క పరసులోంచి పది రూపాయల నోటు తీసి భర్తకు కనపడకుండా జాగ్రత్తగా తమ్ముడికి ఇస్తోంది. “వద్దు అక్కా. నాన్నగారు తిడతారు”
“పరవాలేదులే. ఏమైనా కొనుక్కో. బాగా చదువుకో. అల్లరి తగ్గించు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ నాన్న చేత దెబ్బలు తినకు. సెలవులకి నా దగ్గరికి వద్దువుగానిలే” ఊరడిస్తున్న అక్క.
***                          ***                           ***
బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. డ్రైవర్ తన సీట్లో కూర్చున్నాడు. కండక్టర్ బస్సు చివరి సీటు దగ్గరికి వెళ్లి టిక్కట్లు సరి చూసుకుంటున్నాడు.
అల్లుడు బస్సు ఎక్కేశాడు. బావమరుదులు బస్సు దిగేశారు.
నాన్న బస్సు కిటికీ దగ్గరకొచ్చాడు. కిటికీలోంచి చేయి కింద పెడితే నాన్న చేయిని అందుకుని ” జాగ్రత్త అమ్మ. ఏదైనా పనుంటే వెంటనే కార్డు ముక్క రాయి. వచ్చేస్తా. అల్లుడు మంచి వాడు. బాగా చూసుకో” ఈ మాటలు నూతిలోంచి వస్తున్నట్లుగా ఉన్నాయి.
“నాన్నా మందులు వేసుకోండి. వేళకి తినండి. సిగరెట్లు తగ్గించండి. అమ్మ చాదస్తం. పట్టించుకోకండి. చూడాలనిపిస్తే వెంటనే వచ్చేయండి” ఈ మాటలు విన్న నాన్న
“నువ్వు “ఆడ”పిల్లవిరా. “ఈడ” పిల్లవి కాదు”
బస్సు బయలు దేరింది. చేతులూపుతూ బస్టాండులోనే ఉండిపోయారు ఆ దంపతులు, తోబుట్టువులు.
“ఆ కళ్లు తుడుచుకోండి. ఇంకెంత మరో మూడు నెలల్లో సంక్రాంతి. అప్పుడు వస్తుందిలెండి. నే రాలేదు మీ ఇంటికి. ఇది అలాగే” అంది ఆ ఇల్లాలు.
***                     ***                             ***
అగ్రహారం అంతటా గంభీర వాతావరణం.
అగ్రహారం  అంతటా గుండెలు పిండుతున్న బాధ
అగ్రహారం అంతటా పేగు కదిలిన చిరుశబ్దం
అగ్రహారం అంతటా మబ్బులు పట్టి కళ్లల్లోంచి కురుస్తున్న శ్రావణ మేఘం.
( ఇది నా సహచరి ఈశ్వరికి పేరంటం అంత ప్రేమతో)
Tags: BUJJISRAVANA MASAMStory
Previous Post

HIT బాట పడుతోన్న టాలీవుడ్ దర్శకులు

Next Post

మరో రీమేక్ పై మనసు పడ్డ పవన్ కళ్యాణ్

Related Posts

Arts
news letter

మీరంతా క్షేమమే కదా.. ఇదీ నా స్వగతం?

by హేమసుందర్
November 28, 2020 3:41 pm

అందరికీ వందనాలు, ఉభయ కుశలోపరి అని నేననలేను. మీరు క్షేమమే నా క్షేమం....

Latest News

పెద్ద చదువుకోలేదుగానీ.. పుస్తకాలకు నేస్తం!

by లియో రిపోర్టర్
October 22, 2020 3:23 pm

ఆయన చెరుకు కర్మాగారంలో పనిచేసే ఒక చిరుద్యోగి. పుస్తకాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే...

Editors Pick

నేటి తరానికి స్ఫూర్తి విశ్వనాథ సత్యనారాయణ

by లియో రిపోర్టర్
October 19, 2020 5:00 am

'ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి...

Editors Pick

మాట ఇస్తున్నాం.. మరచిపోతున్నాం..  మన్నించుమా.. గురజాడ

by లియో రిపోర్టర్
September 21, 2020 10:47 pm

'దేశమును ప్రేమించుమన్నా .. మంచియన్నది పెంచుమన్నా' అంటూ వందేళ్ల క్రితం నీవు వల్లించిన...

General

జయహో గురజాడ.. నేటి తరానికి నీ మాట అడుగుజాడ 

by లియో రిపోర్టర్
September 21, 2020 5:35 am

'దేశమంటే మట్టి కాదోయ్ .. దేశమంటే మనుషులోయ్' అంటూ శతాబ్దం కిందట చాటిచెప్పిన...

Latest News

ప్రధాని పీవీ పరువుపోకుండా.. పురస్కారం తీసుకున్న కాళోజీ!

by లియో రిపోర్టర్
September 9, 2020 9:51 am

ప్రజాకవి, తెలంగాణ గొంతు, పద్మవిభూషన్, కాళోజీ నారయణ రావు పేరిట తెలంగాణ ప్రభుత్వం...

Editors Pick

కవి రామాచంద్రమౌళికి కాళోజీ అవార్డు

by లియో రిపోర్టర్
September 8, 2020 11:45 am

కాళోజీ నారాయణ రావు. తెలంగాణ మహాకవి. మహా మనీషి. ఆయన పేరిట ప్రతి...

Literature

ఆల్ రౌండర్ ఆరుద్ర

by లియో స్టాఫ్
August 30, 2020 3:35 pm

ప్రముఖ తెలుగు కవి, సాహిత్య పరిశోధకుడు, ఆల్ రౌండర్ ఆరుద్ర 95వ జయంతి...

Culture

‘కథల’కొలను సదానంద కన్నుమూత

by లియో రిపోర్టర్
August 25, 2020 7:07 pm

బాల సాహిత్యానికి వెన్నెముక కలవకొలును సదానంద కన్నుమూశారు. వృద్ధాప్యమే అయినా సదానంద లేకపోవడమంటే...

Culture

కల… వైకుంఠపురములో…

by హేమసుందర్
August 21, 2020 6:57 pm

పాల సముద్రంలో శేషతల్పంపై ధ్యాన ముద్రలో ఉన్నాడు విష్ణుమూర్తి. శ్రీవారి సేవలో ఉన్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

Anchor Vishnu Priya Hot Stunnig Photos

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

నవరసనాయకి .. ‘షావుకారు’ జానకి (జన్మదిన ప్రత్యేకం)

Janhvi Kapoor looking hot in Saree

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

Actress Naina Ganguly Looks Stunning

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

టీడీపీ నేత మాగంటి బాబు చిన్న కుమారుడు అనుమానాస్పద మృతి

Sreemukhi is a total hot stunner

ముఖ్య కథనాలు

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

చైతు నా భర్త కాదు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

అంబేద్కర్ పేరు తొలగించడం జగన్ అహంకారానికి నిదర్శనం – చంద్రబాబు

నేను చెప్పింది అబద్దం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా – కేటీఆర్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

వివాహిత మంగళసూత్రం తొలగించడం పై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

అంబేద్కర్ పేరు తొలగించడం జగన్ అహంకారానికి నిదర్శనం – చంద్రబాబు

నేను చెప్పింది అబద్దం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా – కేటీఆర్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

వివాహిత మంగళసూత్రం తొలగించడం పై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

కెసిఆర్ ది కపట ప్రేమ.. వాళ్ళే కర్ర కాల్చి వాతపెడతారు – విజయశాంతి

సినిమా

చైతు నా భర్త కాదు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్

సూర్య, దుల్కర్ సల్మాన్, నాని కాంబోలో భారీ మల్టీస్టారర్

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

సంచలన వ్యాఖ్యలు చేసిన రాణా హీరోయిన్

బర్త్ డే రోజు లండన్ వీధుల్లో గంగూలీ హంగామా

గుండెపోటుకు గురైన తమిళ హీరో విక్రమ్

పేరు మార్చుకున్న చిరంజీవి ?

నటుడు నరేష్ వ్యవహారంతో పవిత్ర లోకేష్ కి ఊహించని షాక్ !

టాలీవుడ్ లో మరో విషాదం..

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్ళి లొల్లి..

మహేష్ మూవీలో కనిపించబోయే కన్నడ స్టార్ హీరో ఈయనేనా ?

జనరల్

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

చైతు నా భర్త కాదు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

అంబేద్కర్ పేరు తొలగించడం జగన్ అహంకారానికి నిదర్శనం – చంద్రబాబు

సూర్య, దుల్కర్ సల్మాన్, నాని కాంబోలో భారీ మల్టీస్టారర్

నేను చెప్పింది అబద్దం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా – కేటీఆర్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

వివాహిత మంగళసూత్రం తొలగించడం పై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In