మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమా ఓ పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దసరాకి కాదు.. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని మరో వార్త వచ్చింది. దీంతో ఆచార్య రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తి గా మారింది. అయితే.. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆచార్య రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది అనుకుని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే.. మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా ఎన్నో అప్ డేట్స్ వచ్చాయి.
భోళాశంకర్ టైటిల్ ప్రకటనతో పాటు ఆ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వీడియో కూడా విడుదల అయింది. ఇక బాబీ డైరెక్షన్ లో సినిమా అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. లూసిఫర్ సినిమాకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు కూడా బయట పెట్టారు. సోషల్ మీడియా చిరంజీవి సినిమాల ప్రకటనలతో మోత మోగింది. అయితే.. ఆచార్య నుంచి సింపుల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు కానీ.. రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. కారణం ఏంటంటే.. చిరు దసరాకి రిలీజ్ చేద్దామంటే.. కొరటాల సంక్రాంతికి రిలీజ్ చేద్దామంటున్నారట.
సంక్రాంతికి పోటీ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. అందువల్ల ఆచార్య విడుదల పై ఇంకా క్లారిటీ లేదు. అందుకనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. ఆచార్య రిలీజ్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.










