ఒకప్పటి లవర్ బోయ్ తరుణ్ పెళ్లి అంశం తెరపైకి వచ్చి రచ్చరచ్చ చేస్తోంది. దీంతో వెంటనే తరుణ్ స్పందించాల్సి వచ్చింది. విడాకులు తీసుకున్న ఓ మెగా డాటర్ తో తరుణ్ పెళ్లి అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో తరుణ్ వివరణ ఇవ్వక తప్పలేదు. టాలీవుడ్ లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశారు.
తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో తరుణ్ అంటే తెలియని వారు ఉండరు. మంచి మెలోడీ సినిమాలు చేసి లవర్ బాయ్ గా మారాడు.తను చేసిన అన్ని సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి.పైగా అతడు సీనియర్ నటి రోజారమణి కొడుకు.నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.అయితే ఎక్కువ రోజులు తెలుగు పరిశ్రమ లో తరుణ్ సమయం నడవలేదు.వరుస గా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఆ తర్వాత నుంచి తెలుగు సినీ పరిశ్రమలో నుంచి ఇతడు కనుమరుగైపోయాడు. తరుణ్ సినిమాలకు ఎందుకు దూరమయ్యాడనే విషయాన్ని పక్కన పెడితే తాజా రూమర్లకు చెక్ పెట్టేందుకు మాత్రం సంసిద్ధమయ్యాడు. గతంలో ఆర్తి అగర్వాల్ తో ప్రేమ వ్యవహారం నడిపినట్టు ఎన్నో వార్తలు వచ్చాయి. తల్లి రోజారమణి జోక్యంతో ఆ ప్రేమ పెళ్లి దాకా వెళ్లలేదు.ఆ తర్వాత మళ్లీ ఒక హీరోయిన్ ను ప్రేమించాడని వార్తలొచ్చినా అవి కూడా పెళ్లి పీటలదాకా వెళ్లలేదు. త్వరలో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు అతని తల్లి ఓ ఇంటర్వ్యూలో అనడంతో మళ్లీ తెరపైకి అతని పెళ్లి వార్తలు వచ్చాయి.
ఓ బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అని రోజారమణి అనడంతో ఊహాగానాలు వచ్చాయి.సినిమా రంగంలో బడా ఫ్యామిలీ అనగానే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీలే గుర్తుకు వస్తాయి. కానీ ఇటీవలే విడాకులు తీసుకున్న నిహారిక పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్, సినిమాల నిర్మాణం వైపు దృష్టి సారించి బిజీగా ఉన్నారు. ఇలాంటి వార్తలు రావడంతో తరుణ్ వివరణ ఇవ్వక తప్పలేదు.తరుణ్ అవివాహితుడు కావడంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారం గురించి ఆయన మాట్లాడుతూ ఈ ప్రచారం నిజం కాదని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు.