టీవీ యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి.. టీవీ సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించి.. ఆపై సినీ రంగ ప్రవేశం చేసిన ముద్దు గుమ్మ హిమజ. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, నెక్స్ట్ నువ్వే , ధ్రువ, మహానుభావుడు’ లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలే చేసిన ఆమె .. బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి మరింత గా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం హిమజ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తోంది. దాంతో పాటు టీవీషోస్, టీవీ సీరియల్స్ లోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో హిమజ ఒక హారర్ మూవీలో నటిస్తూ భయపెట్టబోతోంది. సినిమా పేరు ‘జ’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ ను చాలా భయానకంగా డిజైన్ చేశారు. గావుకేక పెడుతోన్న హిమజ తలమీద.. ఒక చేయి సర్పంలా ఉండగా.. ఆమె జుట్టు ఉండాల్సిన భాగంలో అనేక చేతులు రివీలయ్యాయి. అలాగే మెడభాగంలో కూడా కొన్ని చేతులు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జై దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గోవర్ధన్ రెడ్డి కందుకూరి నిర్మాణంలో సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలుస్తాయి.











