భారత్, చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు ఇటీవల వీరమరణం పొందిన విషయం మనకు తెలిసిందే. సంతోష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ నేరుగా సూర్యాపేటకు వెళ్లారు. సంతోష్‌బాబు భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, స్థలం, రూ.5 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రకటించినట్లుగానే రూ.5 కోట్ల చెక్కును, ఉద్యోగానికి సంబంధించిన ప్రతాలు, స్థల పత్రాలను సంతోషికి సీఎం గతంలో అందజేశారు.
అంతేకాకుండా సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రంతో పాటు కేబీఆర్ పార్కు సమీపంలో కేటాయించిన 711 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. అందులో భాగంగానే జులై నెలలో ఆమెకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. అయితే ఈరోజు యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియమితులయ్యారు. ఆ 5 కోట్లల్లో నాలగు కోట్లను సంతోష్‌బాబు పిల్లల పేరిట, ఒక కోటి రూపాయలను ఆయన తల్లిదండ్రులకు అందజేశారు.
ఉద్యోగంలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలో కుదురుకునే వరకు తనకు తోడుగా ఉండాలని తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను సీఎం గతంలో సూచించిన సంగతి తెలిసిందే. శిక్షణ తీసుకుని ట్రైనీ కలెక్టర్‌గా కొత్త బాధ్యతలను సంతోషి చేపట్టారు.











