ఈ ఏడాది ‘అశ్వథ్థామ’తో సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నాగశౌర్య. ఆ విజ యోత్సాహంతో సినిమాల మీద సినిమాల్ని లైన్ లో పెట్టుకుంటున్నాడు. కొన్ని సినిమాల్ని పట్టాలు కూడా ఎక్కించేశాడు. ఈ నేపథ్యంలో నాగశౌర్య ఇప్పుడో క్యూట్ లవ్ స్టోరీతో ఒక సినిమా చేస్తున్నాడు. సౌజన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ రీతూవర్మ కథానాయికగా నటిస్తోంది. కాగా సినిమాకి ‘వరుడు కావాలెను’ అనే క్యాచీ టైటిల్ రిజిస్టర్ చేశారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు నాగశౌర్య సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకూడా ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఇందులో శౌర్య.. విలుకాడుగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ కూడా బిల్డ్ చేశాడు. మరి వరుడు కావలెను మూవీ నాగశౌర్యకి ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.











