ఎన్ని విన్నపాలు చేసినా, ఎన్ని కోర్టు మెట్లెక్కినా చివరికి ట్రంప్ కు ఎక్కడా మద్ధతు లభించలేదు. చివరికి బిడెన్ కే అధ్యక్ష అధికారకంగా మార్పిడి చర్యలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు బిడెన్. ఎన్నికల సమయంలోనే కమలా హారిస్ ని వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎంపిక చేసి సంచలనం సృష్టించాడు. ఆ పై మహిళలకు ప్రాధాన్యమిస్తూ తన మంత్రిత్వ శాఖను ప్రకటించబోతున్నాడని సమాచారం. వైట్ హౌస్ సీనియర్ కమ్యూనికేషన్ విభాగాన్ని మొత్తం ఆడవారి చేతిలో పెట్టాడు. దీనికి సంబంధించి అధికారకంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడదల చేశాడు. ఇది చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.
గెలుపులో భాగస్వామ్యం
వైట్ హౌస్ చరిత్రలోనే మొదటిసారిగా కమ్యూనికేషన్ అధికార గణం మొత్తం ఆడవారితో నిండిపోయింది. తన గెలుపు ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తన గెలుపులో భాగం చేయాలనే ఉద్ధేశంతోనే ఇలా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పదవులప్పగించిన ప్రతి ఒక్కరూ బిడెన్ ఎన్నికల సన్నగ్ధమవుతున్న క్షణం నుండి ప్రచారాలు నిర్వహించి, నేడు అగ్రరాజ్య అధ్యక్షుడి పదవిని చేపట్టబోతున్న సమయం వరకు వీరందరూ బిడెన్ తో ప్రయాణం చేసిన వారు కావడం గమనార్హం.
వీరి అనుమతి తప్పని సరి
కమ్యూనికేషన్ డైరెక్టర్ గా ఎలిజబెత్ ఇ. అలెంగ్జాండర్ ఎంపికైంది. ఈమె గతంలో బిడెన్-కమలా హారిస్ ప్రచార సలహాదారుగా పనిచేశారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా కేట్ బెడింగ్ ఫీల్డ్ ఎంపిక కావడం విశేషం. బిడెన్ ప్రచార సమయంలో డిప్యూటీ క్యాంపెయినింగ్ మ్యానేజర్ గా వ్యవహరించారు. ఎష్లీ ఎటిఎన్నీ, వైస్ ప్రెసిడెంట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. గతంలో బిడెన్-కమలా ప్రచారానికి సీనియర్ సలహాదారుగా పనిచేశారు.
President-elect Biden and Vice President-elect Harris today announced new members of the White House staff who will serve in senior communications roles.
For the first time in history, these communications roles will be filled entirely by women.https://t.co/SjWAWJg941
— Biden-Harris Presidential Transition (@Transition46) November 29, 2020
కెరిన్ జిన్ పెర్రీని ప్రిన్సిపల్ డిప్యూటి ప్రెస్ సెకరెట్రీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జెన్ సకి, వైట్ హౌస్ ప్రెస్ సెకరట్రి. గతంలో బిడెన్-కమలా కు సంబంధిచిన చాలా విభాగాలలో జెన్ కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. సైమోన్ శాండర్స్, సీనియర్ సలహాదారు, వైస్ ప్రెసిడెంట్ ప్రతినిధిగా వ్యవహారాలు నిర్వర్తించబోతున్నట్లు ప్రకటించారు. పిలి తోబర్, వైట్ హౌస్ కమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్ గా ఎంపికైంది.
ఆడవారికి మొదటి ప్రాధాన్యం
బిడెన్ మొదటి నుంచి ఆడవారికి ప్రాధాన్యమిస్తున్నాడనే చెప్పాలి. దేశ చరిత్రలో మొదటిసారిగా వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ ఎంపికైంది. అంతేకాదు, ఆర్ధిక మంత్రిగా కూడా ఆడవారిని ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పడు వైట్ హౌస్ ప్రతినిధుల నుండి ప్రెస్ వరకు అన్నింటా అధికారాలను ఆడవారికి అప్పగించి మరోసారి బిడెన్ తనెప్పటికీ ఆడవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తానని నిరూపించుకున్నాడు. ఇదే తరహాలో ఇంకెన్ని సంచలనాలను తెర తీయనున్నాడో చూడాలి.